Just In
Don't Miss!
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రేమ భాక్సింగ్ (‘వచ్చాడు..గెలిచాడు' ప్రివ్యూ)
రంగం చిత్రంతో తెలుగునాట కూడా పేరు తెచ్చుకున్న జీవా తాజా చిత్రం 'వచ్చాడు..గెలిచాడు'. ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. ఈ చిత్రం కథ ప్రకారం..జీవా(జీవా)కి భాక్సింగ్ అంటే ప్రాణం. అందులో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అంజన(తాప్సీ) కోటీశ్వరుల అమ్మాయి. కానీ ఆ దర్ఫం అస్సలు చూపించదు. తన కాళ్ళమీద తానే నిలబడాలనుకుంటుంది. వీరిద్దరి మధ్యా పరచయం ఎలా జరిగింది. అది కాస్తా ప్రేమగా ఎలా మారింది. అనేదే అస్సలు కథ. జీవా తన అన్నయ్య నంద(నందు) కోసం ఎన్ని సాహసాలు చేసాడోతెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. నిర్మాత మాట్లాడుతూ...జీవా నటించిన 'రంగం' సినిమా చూశాను. టేకింగ్, హీరో పెర్ఫార్మెన్స్ బాగా నచ్చాయి. తెలుగు సినిమాకి మరో మంచి హీరో దొరికాడని ఫీలయ్యాను, 'రంగం' తరువాత జీవా చేస్తున్న సినిమాలేమిటో ఎంక్వయిరీ చేశాను. తాప్సీ కథానాయికగా నటించిన 'వందాన్ వెండ్రాన్' తయారవుతోందని తెలిసింది. ఆ చిత్ర నిర్మాత నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆడియో ఫంక్షన్‌కి పిలిస్తే వెళ్లాను. పాటలు విన్నాను. ట్రైలర్స్ చూశాను. వెంటనే ఆ సినిమాని తెలుగులోకి డబ్ చేయాలని నిర్ణయించుకున్నాను. డబ్బింగ్ హక్కుల కోసం పోటీ బాగా ఉన్నప్పటికీ అందరికంటే అత్యధిక మొత్తం ఇచ్చి రైట్స్ కొన్నాను అన్నారు.
ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. అనువాద చిత్రం చూస్తున్నమన్న ఫీలింగ్ కలగకుండా డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. పాటలను స్విట్జర్లాండ్‌లో తీయడం జరిగింది. 'రంగం' కంటే ఎక్కువ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. నా పుట్టిన రోజున ఈ సినిమా విడుదల కావడం కాకతాళీయమే అయినా ఆనందంగా ఉంది. మణిరత్నం శిష్యుడుఈ చిత్ర దర్శకుడు కణ్ణన్ మణిరత్నం శిష్యుడు. ఆయన శైలిని ఫాలో అవుతూ పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ సినిమా రూపొందించాడు.
సంస్ద:కెవీ ఫిలింస్
నటీనటులు: జీవా, తాప్సీ, రెహమాన్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: కె వేణు గోపాల్
దర్శకత్వం: ఆర్ కణ్ణన్