twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్

    |

    ఏడాదికి ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. అయితే వాటన్నంటిలో కొన్ని మాత్రమే నిలదొక్కుకుంటాయి.. జనాల్లోకి చొచ్చుకుని పోతాయి. దానికి కారణాలెన్నో ఉన్నా గానీ..మంచి కథతో సరికొత్త కథనంతో వస్తే ప్రేక్షకులు ఆధరించడానికి ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. తాజాగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే ఓ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతోంది. ఈ మూవీ ఆడియో వేడుకలో డా. రాజశేఖర్, జీవితా పాల్గొన్నారు.

     సందేశాత్మక చిత్రం

    సందేశాత్మక చిత్రం

    రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా మెసేజ్‌తో కూడిన చిత్రం. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి ఫ్యాషన్ తో ఈ సినిమాను నిర్మించాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి. నటీనటులందరు బాగా నటించారు, ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. యాజమాన్య అందించిన సంగీతం బాగుంది. రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసిన కరుణ కుమార్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కథ బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాయి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో కథ తో పాటు సందేశం ఉంది కావున ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తు సెలవు తీసుకుంటున్నా' అని అన్నారు.

    ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా

    ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా

    జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ... ‘చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం మన పిల్లల్ని ఏ స్కూల్ లో వదలాలి ఆలోచిస్తాం. అలా మనం మన పిల్లలకు మంచి భవిషత్తు ఇవ్వాలని తాపత్రయ పడతాం, సూట్డెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో స్టూడెంట్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంది, ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా ఇది. డైరెక్టర్, నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది, అలాగే ఈ మూవీలో నటించిన కొత్త ఆర్టిస్ట్స్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి, సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న'అని అన్నారు.

    నేను మూవీ చూశాను.. నచ్చింది

    నేను మూవీ చూశాను.. నచ్చింది

    నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ... ‘నా మిత్రుడు ఓబుల్ సుబ్బారెడ్డి సినిమాపైన ఆసక్తితో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాను నిర్మించాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక పాయింట్ ను తీసుకొని ఈ సినిమా తీసాడు దర్శకుడు కరుణ కుమార్. నేను మూవీ చూశాను, నచ్చింది, అందుకే ఈ చిత్రాన్ని నేనే స్వయంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చాను. కచ్చితంగా ఈ సినిమా ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాన'అని అన్నారు.

    మంచి సందేశం ఉన్న కథ

    మంచి సందేశం ఉన్న కథ

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ‘మంచి సందేశం ఉన్న కథతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీయ్యడం జరిగింది. నేను తెలుగులో తీసున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. హీరో శ్రీనాధ్ మాగంటి బాగా నటించాడు. హరిప్రసాద్ గారు మాకు మంచి కథను అందించారు. అన్న మల్కాపురం శివకుమార్ ఈ సినిమా చూసి ఫాన్సీ రేటుకు సినిమా కోనడం మరింత ఎనర్జీ ఇచ్చింది. డబ్బు వస్తుందా లేదా అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న తృప్తి ఉంద'న్నారు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    ఎక్కడా రాజీ పడకుండా

    ఎక్కడా రాజీ పడకుండా

    డైరెక్టర్‌ కరుణ కుమార్‌ మాట్లాడుతూ... నా నిర్మాత ఓబుల్‌ సుబ్బారెడ్డి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నా మిత్రుడు హరి ప్రసాద్‌ చక్కటి మెసేజ్‌ ఉన్న కథను అందించాడు. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పారు. డిసెంబర్ 27న విడుదల కాబోతున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ పాయింట్‌ అందరికీ తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది' అని తెలిపారు.

    English summary
    Student Of The Year Movie Audio Launch. Rajasekhar And Jeevitha Rajasekhar Attended The Event. This Movie Is Directed By Karuna Kumar. It Is Goint To Be Released Ob 27th December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X