twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరి ముందు సెక్స్ చేయలేం కదా: సభా ముఖంగా ఏకిపారేసిన నటి జీవిత

    |

    వరుణ్, దివ్యా రావు హీరో హీరోయిన్లుగా నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డిగ్రీ కాలేజ్'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవిత... ట్రైలర్ చూసి షాకయ్యారు. సినిమాలో శృతి మంచిన శృంగార సీన్లు, లిప్ లాక్ సీన్లు ఉండటంపై ఏకిపారేశారు.

    ''ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు నా లాంటి రాంగ్ పర్సన్‌ను పిలిచారు అనిపించింది. నేను సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌.. మీ సినిమా ఇంకా సెన్సార్ కాలేదనుకుంటున్నా. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల పుణ్యమా అని లిప్ లాక్ లేకుండా తెలుగు సినిమా లేదు అనే విధంగా పరిస్థితి దిగజారిపోయిందని ఫీలవుతున్నాను'' అని జీవిత వ్యాఖ్యానించారు.

    ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది

    ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది

    ‘‘మీ సినిమా కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. నేను చూసిన దాంట్లో నాలుగైదు షాట్లు, అవే.. మీ పోస్టర్ అదే.. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా కవర్డ్‌గా ఉన్నంతవరకే అందం. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకుంటే బాత్రూంలో స్నానం చేస్తాం, బెడ్రూంలో పడుకుంటాం. హాలులో కూర్చుంటాం. హాలులో వచ్చి స్నానం చేయం. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది... అన్నీ ఉంటాయి. అవి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బావుంటుంది. పబ్లిగ్గా రోడ్డు మీద చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది'' అని జీవిత చెప్పుకొచ్చారు.

    అలాంటి దర్శకులతో వాదించలేం

    అలాంటి దర్శకులతో వాదించలేం

    ఈ రోజుల్లో ప్రతి సినిమాలో లిప్ లాక్ తప్పనిసరి అనే విధంగా తయారైంది. బట్టలిప్పుకోవడం, అమ్మాలు అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం.. సీన్లు కామన్ అయిపోయాయి. ఇది మీ జీవితంలో లేదా? అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ మనం రోడ్డు మీద అలాంటి పనులు చేయం. ముందు నుంచీ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలా ఎందుకు చేయకూడదు అని అడ్డంగా మాట్లాడే దర్శకులతో మనం వాదించలేం.

    అందరి ముందు సెక్స్ చేయలేం కదా

    అందరి ముందు సెక్స్ చేయలేం కదా

    ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి... సోషల్ మీడియాలో, టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అంటే... ఉంటున్నాయి. అవి మనం ఒక రూములో, ఒక్కరం కూర్చుని చూస్తాం. సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది. కొన్ని వందల మంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. మూవీలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

    సెన్సార్ బోర్డుకు కొన్ని రూల్స్ ఉన్నాయి

    సెన్సార్ బోర్డుకు కొన్ని రూల్స్ ఉన్నాయి

    ఇలాంటివి వచ్చినపుడు సెన్సార్ ఏం చేస్తుంది అని కొందరు అంటారు. కానీ సెన్సార్ వారికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది వద్దండీ అంటే పెద్ద గొడవ చేస్తారు. సెన్సార్ బోర్డు మీద ప్రెస్ మీట్లు పెట్టి సినిమాను ఆపేస్తున్నారని గంధరగోళం చేస్తున్నారు, కోర్టులకు వెళుతున్నారని జీవిత గుర్తు చేసుకున్నారు.

    సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి

    సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి

    సెన్సార్ బోర్డు కానీ, మరెవరో కానీ మనల్ని రెక్టిఫై చేయలేరు... మనకు ఒక సోషల్ రెస్పాన్స్ అనేది ఉండాలి. ప్రతి దర్శకుడు, రచయిత నుంచి నేను కోరుకునేది అదే. మనకు కుటుంబాలు ఉన్నాయి, ఆడ పిల్లలు ఉన్నారు అనేది గుర్తుంచుకోవాలి. దానికి తగిన విధంగా సినిమాలు రావాలి.

    బట్టలిప్పి అమ్మాయిలను చూపించినా సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుంది

    బట్టలిప్పి అమ్మాయిలను చూపించినా సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుంది

    మీ సినిమాను నేను తప్పుబడట్టం లేదు. ఇప్పుడు ఉన్న ప్లోలో మీరు తీశారు. కానీ ఇలా తీస్తేనే సక్సెస్ అవుతుంది అనేది చాలా తప్పుడు ఆలోచన. మీరు ఏమి తీసినా, బట్టలిప్పి అమ్మాయిలను చూపించినా సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుంది. సెన్సార్ వారికి కూడా ఒక్కోసారి చాలా కష్టం అయిపోతుంది. కొన్ని సినిమాలకు సెన్సార్ ఇవ్వకూడదు, ఆపేయాలని చెప్పాలనిపిస్తుంది. కానీ నిర్మాతలను తలుచుకుని అయ్యోపాపం, వాళ్లు రోడ్డు మీదకు వచ్చేస్తారనే ఆలోచన వస్తుంది.

    ఇలా మాట్లాడినందుకు సారీ

    ఇలా మాట్లాడినందుకు సారీ

    సినిమాలో అలాంటి చూపించడం వల్ల ఇలాగే ఉండాలేమో అనే ఆలోచనలు యువతలో వచ్చే ఆస్కారం ఉంది. ఈ సొసైటీ గురించి ఆలోచించి సినిమాలు చేయండి. నేను మీ సినిమా కార్యక్రమానికి వచ్చి ఇలా మాట్లాడినందుకు సారీ.. ఇది కాంట్రవర్సీ కోసం చెప్పలేదు. నేను నా మనసులో ఉన్నది చెప్పాను. ఆ సీన్ల సంగతి పక్కన పెడితే మీ మేకింగ్ బావుంది, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. ఈ సినిమా మీకు సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నాను.

    ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం

    ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం

    ఈ రోజుల్లో సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని, సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని రిలీజ్ చేయడం కూడా అంతే కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకున్న పాషన్‌తో, ప్రేమతో, ఇష్టంతో ఎన్ని కష్టాలున్నా ఎదుర్కొని నాలాగా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందులో నరసింహ నంది ఒకరు. ఈ సినిమాకు చాలా మంది నిర్మాతలు ఉన్నారని తెలిసింది. మీరు ఎవరూ నష్టపోకుండా ఈ సినిమా మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు జీవిత తెలిపారు.

    English summary
    Actress Jeevitha sensational comments on Degree College trailer launch event. Shehas attended as a chief guest for the trailer launch of Degree College. ;Few directors are showing liplock and other vulgar scenes in thire movies' Jeevitha said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X