»   »  ఇండియా పెళ్లి వేడుకలో జెన్నిఫర్ లోపెజ్ ఆట పాట?

ఇండియా పెళ్లి వేడుకలో జెన్నిఫర్ లోపెజ్ ఆట పాట?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోజెన్. ఆమె పెర్పార్మెన్స్ ఇవ్వడం అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. త్వరలో భారత్ లో జరిగే ధనవంతుల పెళ్లి వేడుకలో జెన్నిఫర్ ఆడి పాడనుందని తెలుస్తోంది. యూకె బేస్డ్ బిలియనీర్, హిందూజా గ్రూపుకు చెందిన పారిశ్రామిక వేత్త సంజయ్ హందూజా పెళ్లి వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇవ్వనుందట. డిజైనర్ అనుమర్చందినిని అతను పెళ్లాడబోతున్నాడు.

ఉదయ్ పూర్‌లో ఈ పెళ్లి వేడుక జరుగనుంది. ఈ నెల 10 నుండి 12 వరకు జరిగే ఈ వేడుకకు దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ పెళ్లి వేడుకలో జెన్నిపర్ లోపెన్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇక్కడ ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లోని కోహినూర్ సూట్లో ఆమె విడిది చేయనున్నారు. ఈ సూట్లో ఒక్కరాత్రి స్టే చేయడానికి రూ. 3 లక్షలు చార్జ్ చేస్తారు. అయినా వేల కోట్ల అధిపతులకు ఇదో లెక్కా? ఆమె వసతి సౌకర్యాలే ఈ రేంజిలో ఉన్నాయంటే రెమ్యూనరేషన్ ఏ రేంజిలో ఉంటుందో?

Jennifer Lopez To Perform In Indian Wedding?

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆ మధ్య 40 నిమిషాల పెర్ఫార్మెన్స్ కు 11 కోట్ల రెమ్యూనరేషన్

జెన్నిఫర్ లోపెజ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు(2500 కోట్లు). అయినప్పటికీ డబ్బు సంపాదించడానికి వచ్చి ఏ ఆఫర్ కూడా ఆమె వదులుకోవడం లేదు. ఆ మధ్య క్రిస్ మస్ సందర్భంగా ఆమె మకావ్‌లో ఓ ప్రైవేట్ పార్టీలో 40 నిమిషాల పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందుకు గాను ఆమె రూ. 1.75 మిలియన్ డాలర్లు (రూ. 11 కోట్లపైనే) చార్జ్ చేసారు. 45 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటికీ తన సెక్సీ అందాలు, అదరగొట్ట పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది.

ఆమెకు 40 నిమిషాల పెర్ఫార్మెన్స్ కోసం ఆమెకు 1.75 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తో పాటు అమెరికా నుండి మకావ్ వరకు ప్రత్యేక విమానం ఏర్పాట్లు గట్రా చేసారట. దీన్ని బట్టి ఆమెకు షోలకు ఉన్న ఫాలోయింగ్, డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

జెన్నిఫర్ లోపెజ్ గురించిన ఇతర విషయాల్లోకి వస్తే... ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు సైతం తీసుకున్న జెన్నిఫర్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ తో ప్రేమాయణం నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ పెళ్లి కాకుండానే వీరి బంధం పెటాకులైంది. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా తప్పులు చేసానని....ప్రస్తుతం తన పిల్లలు తండ్రి లేని వారు కావడం బాధగా ఉందని, వారి జాగ్రత్తగా చూసుకుంటాను అంటోంది జెన్నిఫర్.

English summary
If rumors are anything to go by, then Jennifer Lopez is expected to perform at the Hinduja Wedding. It is Industrialist Sanjay Hinduja’s wedding with designer Anu Mahtani this week and the wedding is on in full-swing!
Please Wait while comments are loading...