Jhansi Ki Rani Heroine దుమ్మురేపిందిగా.. CBSE రికార్డు మార్కులు.. ఎంత శాతం వచ్చిందంటే...

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న వర్థమాన తారల్లో అష్నూర్ కౌర్ ఒకరు. ఝాన్సీకి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై, పాటియాల బేబ్స్ లాంటి సీరియల్స్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక సంజూ చిత్రంలో కూడా తనదైన శైలిలో నటించి ఆకట్టుకొన్నది. అయితే ఓ వైపు కెరీర్‌ను చక్క బెడుతూనే ఎడ్యుకేషన్‌‌పై కూడా దృష్టి పెట్టింది. జోడు గుర్రాలపై ప్రయాణిస్తున్న ఈ యువ తార తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. అష్నూర్ కౌర్ సాధించిన ఘనత ఏమిటంటే..

ఇటీవల నిర్వహించిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు ఆమె హాజరయ్యారు. తాజాగా ఆ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. ఆ పరీక్షల్లో అష్నూర్‌కు 94 శాతం మార్కులను సాధించడం విశేషంగా మారింది.

Jhansi Ki Rani fame Ashnoor Kaur secures 94 percent in CBSE exams

సీబీఎస్ఈ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాన్ని సాధించిన యువతార జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు. చాలా కష్టపడి పరీక్షలు రాశాను. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత అద్బుతమై ఫీలింగ్‌తో ఉన్నాను. పదో తరగతి పరీక్షల్లో 93 శాతం మార్కులు వచ్చాయి. అయితే 12వ తరగతిలో అంతకంటే ఎక్కువగా మార్కులు వస్తాయని ఊహించాను. అయితే ఓవరాల్‌గా నేను చాలా హ్యాపీగా ఉంది అని అష్నూర్ కౌర్ తెలిపారు.

సీబీఎస్ఈ ఫలితాల తర్వాత నేను మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేయాలనుకొంటున్నాను. మాస్టర్స్ చదవడానికి విదేశాలకు వెళ్తాను. కెరీర్ విషయానికి వస్తే.. నటించడంతోపాటు సినిమాలను నిర్మించాలని, డైరెక్షన్ చేయాలని అనుకొంటున్నాను అని అష్నూర్ కౌర్ తన ప్లాన్స్ వెల్లడించింది.

ఇక ఇటీవల సొంత ఇంటిని కలను సాకారం చేసుకొంటున్నాను అని అష్నూర్ కపూర్ తెలిపింది. నా డ్రీమ్ హౌస్‌ను ఈ మధ్య బుక్ చేసుకొన్నాను. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. త్వరలోనే ఆ ఇంటి పనులు పూర్తి అవుతాయి. వచ్చే ఏడాది తొలి భాగంలో గృహ ప్రవేశం చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అని అష్నూర్ కౌర్ వెల్లడించింది.

టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న అష్నూర్.. సంజూ మన్మర్‌జియాన్ చిత్రంలో నటించారు. త్వరలోనే మంచి చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X