»   » హీరో తమ్ముడితో శ్రీదేవి కూతురు జాన్వీ డేటింగ్‌.. (ఫొటోలు )

హీరో తమ్ముడితో శ్రీదేవి కూతురు జాన్వీ డేటింగ్‌.. (ఫొటోలు )

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్నాళ్లుగా బాలీవుడ్ సర్కిల్స్ లో.. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తో.. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించ బోతున్నారన్న రూమర్ ప్రచారం లో ఉంది. అయితే వారిద్దరు కలిసి నటించబోయే సినిమా ఇంకా ఫైనలే కాలేదు. అసలు సినిమా ఉంటుందో లేదో తెలియదు. కానీ, ఆ జంట మాత్రం ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండాలని తెగ ఆరాటపడిపోతోంది.

ఈ కెమిస్ట్రీ సినిమా వరకేనా

ఈ కెమిస్ట్రీ సినిమా వరకేనా

అంతేకాదు.. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని టూర్లకు వెళ్లిపోతున్నారట. మరాఠీలో సూపర్ హిట్ అయిన సైరత్ సినిమా రీమేక్‌తోనే ఝాన్వి బాలీవుడ్ అరంగేట్రం ఉంటుందని, కరణ్ జోహార్ ఆ సినిమాను నిర్మిస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ జంట కెమిస్ట్రీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందన్న టాక్ అయితే బయట ఉంది. అయితే ఈ కెమిస్ట్రీ సినిమా వరకేనా అన్న అనుమానాలూ లేక పోలేదు...

‘బేవాచ్‌' ప్రీమియర్‌ షో

‘బేవాచ్‌' ప్రీమియర్‌ షో

ప్రియాంక చోప్రా తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌' ప్రీమియర్‌ షో ఊహించినట్టుగానే స్టార్స్‌ సందడితో హల్‌చల్‌ చేసింది. ప్రియాంక జర్మనీలో ఉన్నా.. బాలీవుడ్‌ స్టార్లు చాలామంది ఈ ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. అయితే, అందరి దృష్టిని మాత్రం ఓ యువజంట ఆకర్షించింది.

షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌

షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ను వెంట తీసుకొని ఈ షోకు హాజరు కావడం.. అందరినీ ఒకింత విస్మయపరిచింది. మొత్తానికి ఈ కెమిస్ట్రీ ఏదో ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్కౌట్ అవుతుందేమో అనుకుంటున్నారు. అయినా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుభందం ఇప్పటిది కాదు...

బద్రీనాథ్ కీ దుల్హనియా

బద్రీనాథ్ కీ దుల్హనియా

ఇది ఇప్పుడే కాదు గతం లో కూడా వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా రూపొందిన బద్రీనాథ్ కీ దుల్హనియా చిత్రం ప్రీమియర్‌ సమయం లోకూదా ఝాన్వి, ఇషాన్‌లు కలిసి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఝాన్వి స్టైలిష్‌గా వచ్చినా.. ఇషాన్ మాత్రం సింపుల్‌గా ప్రీమియర్‌కు అటెండ్ అయ్యాడు. ప్రీమియర్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన వాళ్లంతా అప్పుడే ఇదేదో కెమిస్ట్రీ కంటే ఫిజిక్స్ లో కూడా వర్కౌట్ అవుతుందేమో అని అనుమానం లో ఉన్నారు.

English summary
Rumoured lovebirds Jhanvi Kapoor and Ishaan Khatter arrived together for the screening of Baywatch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu