»   » శ్రీదేవి కూతురును వదిలేసి... సచిన్ కుమార్తెతో పార్టీలో చిందేసిన జాహ్నవి ప్రియుడు

శ్రీదేవి కూతురును వదిలేసి... సచిన్ కుమార్తెతో పార్టీలో చిందేసిన జాహ్నవి ప్రియుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ ప్రియుడని ప్రచారంలో ఉన్న శిఖర్ పహారియా ఇటీవల ఓ పార్టీలో సచిన్ టెండూల్కర్ కుమార్తెతో చిందేస్తూ మీడియా కంటపడ్డాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ పది సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో సచిన్ కూతురు సారా టెండూల్కర్‌, శిఖర్ మంచి జోష్‌లో మునిగి తేలడం చర్చనీయాంశమైంది.

సారా టెండూల్కర్‌తో జాహ్నవి ప్రియుడు

సారా టెండూల్కర్‌తో జాహ్నవి ప్రియుడు

గత కొద్దికాలంగా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ బాయ్‌ఫ్రెండ్‌తో విందులు, షికార్లు, వినోదాలు ముంబై మీడియాలో ప్రముఖంగా మారాయి. బాలీవుడ్‌లో ఇంకా ప్రవేశించకుండానే జాహ్నవి జోరు చూసి ముక్కున వేలేసుకున్నారు. ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగడంతో శ్రీదేవి కూడా తలపట్టుకోవాల్సి వచ్చింది.

ముఖేశ్ పార్టీలో సారాతో శిఖర్

ముఖేశ్ పార్టీలో సారాతో శిఖర్

తాజాగా ముంబైలో ముఖేశ్ అంబానీ ఇచ్చిన పార్టీకి జాహ్నవి, శిఖర్, సారా టెండూల్కర్ కూడా హాజరయ్యారు. అయితే జాహ్నవితో కాకుండా సారాతో శిఖర్ సయ్యాటలాడటంపై అనేక అనుమానాలు తలెత్తాయి. జాహ్నవి, శిఖర్ మధ్య బ్రేకప్ జరిగిందా అనేంత వరకు సందేహాలు వెళ్లాయి. ఈ పార్టీలో శిఖర్‌కు దూరంగా ఉన్న జాహ్నవి ఇతర ప్రముఖులతో కలిసి మెలిసి పార్టీని ఎంజాయ్ చేసిందట. ఈ పార్టీకి సల్మాన్ ఖాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ఓ నైట్ పబ్‌లో జాహ్నవితో శిఖర్

ఓ నైట్ పబ్‌లో జాహ్నవితో శిఖర్

గతంలో ముంబైలోని ఓ నైట్ పబ్‌లో శిఖర్‌తో జాహ్నవి అతిసన్నిహితంగా ఉండటం జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆ తర్వాత శ్రీదేవి దంపతులు జాహ్నవిని హద్దులో ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేంత వరకు కాస్తా జోష్ తగ్గించాలని, మీడియా కంట పడకుండా ఉండాలని దర్శకుడు కరణ్ జోహర్ హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే.

రణ్‌వీర్‌సింగ్‌తో సారా టెండూల్కర్

రణ్‌వీర్‌సింగ్‌తో సారా టెండూల్కర్

ఇదిలా ఉండగా మధ్య కాలంలో సారా టెండూల్కర్ జోష్ కూడా పత్రికలు ఎక్కింది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో సారా దిగిన ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇటీవల సారా యాక్టింగ్‌పై దృష్టిపెట్టిందంటూ వచ్చిన రూమర్లను సచిన్ ఖండించారు. ప్రస్తుతం సారా దృష్టి అంతా చదువుపైనే ఉంది. ఆ తర్వాతే యాక్టింగా లేదా ఇంకా మరోటా అనేది సారా నిర్ణయించుకొంటుంది. సారా బాలీవుడ్ ప్రవేశం కేవలం మీడియా కట్టుకథనాలే అని సచిన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

సైరత్‌తో జాహ్నవి బాలీవుడ్‌కు..

సైరత్‌తో జాహ్నవి బాలీవుడ్‌కు..

ప్రస్తుతం జాహ్నవిని బాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ భుజాన వేసుకొన్నాడు. మరాఠీ భాషలో దుమ్ము రేపిన సైరత్ చిత్రాన్ని రీమేక్‌గా హిందీలో తెరకెక్కించనున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

English summary
Jhanvi attended Mukesh Ambani's party to celebrate 10 years of his Indian Premier League (IPL) team, Mumbai Indians. We stumbled across a picture of her rumoured boyfriend Shikhar Pahariya at the same party, but he was seen posing with Sachin Tendulkar's daughter Sara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu