»   » బర్త్ డే పార్టీలో..... శ్రీదేవి, ఆమె కూతురు హాట్‌లుక్ హైలెట్ (ఫోటోస్)

బర్త్ డే పార్టీలో..... శ్రీదేవి, ఆమె కూతురు హాట్‌లుక్ హైలెట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఒకప్పుడు అతిలోక సుందరిగా ఇండియన్ సినిమా రంగాన్ని తన అందంతో ఏలిన హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో ఆమె ఎంతో మంది కుర్రాళ్ల కలల రాణి. త్వరలో శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న ఆమె కూతురు జాన్వి కపూర్ కూడా తల్లి పేరును నిలబెట్టడం ఖాయం గా కనిపిస్తోంది.

మందు, విందు..ఫుల్ ఖుషీ: మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో బాలీవుడ్ స్టార్స్ (ఫోటోస్)

ఇటీవల ముంబైలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పుట్టినరోజు వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు శ్రీదేవి ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఈ పార్టీలో శ్రీదేవి, ఆమె కూతురు జాన్వి కపూర్ కళ్లుతిప్పుకోలేనంత అందంగా, హట్ గా కనిపించి పార్టీలో హైలెట్ అయ్యారు.

శ్రీదేవి

శ్రీదేవి

శ్రీదేవి వయసు 50 ఏళ్లు దాటినా ఇంకా ఆమోలో అందం, అట్రాక్షన్ ఏ మాత్రం తగ్గలేదు అంటున్నారు అభిమానులు. ఇక త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న జాన్వి కపూర్ హాట్ అండ్ సెక్సీ లుక్ తో అందరి మతులు పోగొట్టింది.

ఇద్దరు కూతుళ్లు

ఇద్దరు కూతుళ్లు

ఈ వేడుకకు శ్రీదేవితో పాటు ఆమె భర్త బోనీ కపూర్... ఇద్దరు కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ హాజరయ్యారు. కూతుళ్లు ఇద్దరూ చాలా అందంగానే ఉన్నప్పటికీ.... జాన్వి కపూర్ లో మాత్రమే శ్రీదేవిలో ఉన్నటువంటి అట్రాక్షన్ ఉందని అంటున్నారు.

కరణ్ జోహార్ మూవీ ద్వారా

కరణ్ జోహార్ మూవీ ద్వారా

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ త్వరలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కరణ్ జోహార్ రెగ్యులర్ గా శ్రీదేవితో మీటింగ్స్ జరుపుతున్నారట. శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారని, అందులో భాగంగానే కరణ్ జోహార్ ఆమెను తరచూ మీట్ అవుతున్నారని టాక్.

అప్పట్లో హిట్

అప్పట్లో హిట్

అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో తెరకెక్కించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ఈ ముగ్గురు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ఇపుడు మంచి అవకాశాలతో బాలీవుడ్లో దూసుకెలుతున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సెకండ్ పార్టులో ఝాన్వి కపూర్ ను పరిచయం చేయాలనేది కరణ్ జోహార్ ప్లాన్. అయితే శ్రీదేవి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు విని... ఇంకా 'ఎస్' అని కానీ 'నో' అని కానీ చెప్పలేదట.

శ్రీదేవి ఏమంటోందంటే.

శ్రీదేవి ఏమంటోందంటే.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవికి తన కూతురు ఎంట్రీ గుంచిన ప్రశ్న ఎదురైంది. దానికి శ్రీదేవి సమాధానం ఇస్తూ...'నటనారంగంలోకి రావాలని కోరుకోని పిల్లలు ఎవరుంటారు? ప్రతి చైల్డ్ యాక్టర్ కావాలని కలలుకంటాడు. వారు అలా ఆశ పడటంలో తప్పేమీ లేదు. కానీ ఇది అంత సులభమైన జాబ్ కాదు. దీనికి చాలా హార్డ్ వర్క్...అంకితభావం కావాలి. వారు ఈ విషయాల్లో ఎఫర్టు పెట్టడానికి సిద్దమైతే...రావడం మంచిదే! అని సమాధానం ఇచ్చింది.

ఇదే ఫైనల్ అవుతుందా?

ఇదే ఫైనల్ అవుతుందా?

గతంలో ఝాన్వి కపూర్ పలు సినిమాల్లో నటించబోతోందంటూ వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమా మాత్రం ఖాయం అయ్యేలా కనిపిస్తోంది.

షాహిద్ తమ్ముడు కూడా

షాహిద్ తమ్ముడు కూడా

ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్-అమృత సింగ్ కూతురు సారా అలీ ఖాన్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నటనలో శిక్షణ

నటనలో శిక్షణ

ఝాన్వి కపూర్ ప్రస్తుతం యాక్టింగులో కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

English summary
Check out photos: Jhanvi, Khushi and Sridevi stunning look at Manish Malhotra's birthday bash. Manish Malhotra's 50th birthday bash was a star-studded affair.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu