twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్ చావుకు కారణం ఆ హీరోనే: కోర్టు తీర్పుతో బాధ పడకుండా సంతోషం....

    By Bojja Kumar
    |

    బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ ఆత్మహత్య కేసు అప్పట్లో పెను సంచలనం అయింది. గత నాలుగున్నరేళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసులో తాజాగా ముంబై సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆమె చావుకు కారణం బాలీవుడ్ నటుడు, ఆమె ప్రియుడైన సూరజ్ పంచోలి అని స్పష్టం చేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది.

     సూరజ్ పంచోలి మీద కేసుకు కోర్టు ఆదేశం

    సూరజ్ పంచోలి మీద కేసుకు కోర్టు ఆదేశం

    వాదోప వాదాలు అనంతరం కోర్టు... జియా ఆత్మహత్యకు కారణమైన సూపరజ్ పంచోలిపై ఐపీసీ సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో అతడికి శిక్ష పడితే అతడు 10 ఏళ్ల వరకు జైలుకెళ్లే అవకాశం ఉంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 14న జరిగే అవకాశం ఉంది.

     ఇప్పటికైనా కేసు ఓ కొలిక్కి వచ్చినందుకు సంతోషం

    ఇప్పటికైనా కేసు ఓ కొలిక్కి వచ్చినందుకు సంతోషం

    సెషన్స్ కోర్టు తీర్పు పట్ల సూరజ్‌ పంచోలి కుటుంబ సభ్యులు స్పందిస్తూ కేసు ఇప్పటికైనా ఓ కొలిక్కి వచ్చినందుకు సంతోషం, ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కేసు సరిగ్గా గాడిలో పడింది. ఇక మేం నిజమైన పోరాటం చేస్తాం... అంటూ సూరజ్ తండ్రి, బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి మీడియాతో అన్నారు.

    సిగ్గు పడటం లేదు, మా వాడు బయటకు రావాలి

    సిగ్గు పడటం లేదు, మా వాడు బయటకు రావాలి

    ఈ తీర్పుకు మేము సిగ్గుపడటం లేదు, మేము సిగ్గు పడితే సూరజ్‌‌కు శిక్షపడుతుంది. అందుకే మేము ఓపెన్‌గా ఉండాలనుకుంటున్నాం,మాకు కావాల్సింది మా కుమారుడు బయటకు రావడమే...అని ఆదిత్య పంచోలి వ్యాఖ్యానించారు.

     హత్యగా చిత్రీకరించాలనుకున్నారు, అందుకే సంతోషం....

    హత్యగా చిత్రీకరించాలనుకున్నారు, అందుకే సంతోషం....

    ‘జియా తల్లి రబియా ఖాన్‌ న్యాయస్థానం నుంచి తరచూ స్టే కోరుతూ దీన్ని హత్య కింద చిత్రీకరించాలని అనుకున్నారు, కోర్టు దీన్ని ఆత్మహత్యగా తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉంది’ ఆదిత్య పంచోలి తెలిపారు.

     నా వాడికి చాలా జీవితం ఉంది

    నా వాడికి చాలా జీవితం ఉంది

    సూరజ్ చాలా చిన్నవాడని, అతడికి చాలా జీవితం ఉందని, తమ కుమారుడి జీవితం కోసం తాము న్యాయ పోరాటం చేస్తామని ఆదిత్య పంచోలి తెలిపారు.

     మా వెంట సల్మాన్ ఖాన్ ఉన్నారు

    మా వెంట సల్మాన్ ఖాన్ ఉన్నారు

    బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ తోపాటు ఎంతో మంది ప్రముఖులు తమకు అండగా ఉన్నారని, తమ కుమారుడికి న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నామని ఆదిత్య పంచోలి తెలిపారు.

     జియా-సూరజ్ ప్రేమాయణం

    జియా-సూరజ్ ప్రేమాయణం

    2013లో జియా ముంబయిలోని జుహులో ఉన్న తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు నుండే ఇద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే జియా తల్లి మాత్రం తన కూతురును హత్య చేశారని వాదిస్తూ వస్తోంది.

    బాలీవుడ్లో హీరోగా పరిచయమైన సూరజ్

    బాలీవుడ్లో హీరోగా పరిచయమైన సూరజ్

    2015లో ‘హీరో' అనే చిత్రం ద్వారా సూరజ్ పంచోలి కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ నిర్మించారు. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. జియా ఖాన్ బాలీవుడ్లో చాలా చిత్రాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్‌తో ‘నిశ్శబ్ద్' చిత్రంలో నటించింది. దీంతో పాటు హిందీ గజిని, హౌస్ ఫుల్ చిత్రాల్లో నటించింది.

    English summary
    A sessions court on Tuesday framed charges against actor Sooraj Pancholi of abetting the suicide of his girlfriend actor Jiah Khan in 2013. Pancholi, who was present in the court, pleaded not guilty. The trial is expected to begin on February 14. The charge of abetment of suicide under Section 306 of the IPC attracts a maximum punishment of 10 years in jail. Pancholi's lawyer Prashant Patil withdrew the discharge plea he had submitted earlier.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X