»   » జియా ఖాన్ కేసు: కొడుకును వెనకేసుకొస్తోన్న జరీనా

జియా ఖాన్ కేసు: కొడుకును వెనకేసుకొస్తోన్న జరీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె ప్రియుడు సూరజ్ పంచోలి కారణమనే వార్తల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈవిషయమై సూరజ్ పంచోలి తల్లి జరీనా వాహెబ్ మండి పడ్డారు. జియాఖాన్ ఆత్మహత్య కేసులో తన కొడుకును బ్లేమ్ చేయొద్దంటూ ఆమె ఘాటుగా స్పందించారు.

ఒకరు ప్రేరేపిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి జియా ఖాన్ 10 ఏళ్ల చిన్నపిల్ల కాదు. ఆమె వీక్ పర్సన్. అందకే అలా చేసింది. ఈ విషయంలో నా కొడుకును బ్లేమ్ చేస్తే ఊరుకునేది లేదు. హైదరాబాద్ వెళ్లి వచ్చినప్పటి నుండే జియా ఖాన్ డిప్రెషన్లో ఉందని ఆమె తల్లి కూడా చెప్పింది. అలాంపుడు నా కొడుకును నిందించడం ఎందుకు? అని జరీనా వాహెబ్ వ్యాఖ్యానించారు.

 Zarina Wahab

కాగా...జియాఖాన్ ఆత్మహత్య కేసులో న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేసిన ముంబై పోలీసులు.. ఆమెను ప్రియుడు సూరజ్ పంచోలీయే ఆత్మహత్యకు ప్రేరేపించాడని పేర్కొన్నారు. 447 పేజీల ఛార్జీషీటును పోలీసులు ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు.

మొత్తం 22 మంది సాక్ష్యాలను అందులో పేర్కొన్నారు. జియాఖాన్‌కు గర్ఫస్రావం చేసిన వైద్యులు, ఆమె నివసించే భవనం వాచ్‌మెన్, సూరజ్ నివాసంలోని పనిమనుషులు, స్నేహితుల సాక్ష్యాలను అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫోరోన్సిక్ నివేదికలను ఉంచారు.

కాగా, గత ఏడాది జూన్ 3వ తేదీన జియాఖాన్ ఉరేసికొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జియా లేఖ అంటూ ఆమె తల్లి ఆరు పేజీల లేఖను పోలీసులకు అందించారు. అందులో సూరజ్ పంచోలితో తనకు గల సంబంధం, ఆయన తనను ఎలా వంచించారో పేర్కొన్నారు. ఆ తర్వాత సూరజ్ అరెస్టై ముంబై హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.

సూరజ్, జియాఖాన్‌ల మధ్య సంబంధం ఉందనేందుకు చాలా సాక్ష్యాలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆత్మహత్య చేసుకునే రోజు కలవాలని జియా కోరినప్పటికీ సూరజ్ కలవలేదన్నారు. మరోవైపు జియాఖాన్‌ను ఎవరైనా చంపవచ్చునని ఆమె తల్లి అనుమానిస్తున్నారు. కానీ, పోలీసులకు అందుకు ఆధారాలు లభించలేదు.

English summary

 Actor Zarina Wahab has defended her son, 22-year-old Sooraj Pancholi, who has been charged with the abetment of actor Jiah Khan’s suicide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu