»   » ఎక్సపెక్ట్ చేయం, మతిపోగొట్టారంతే: 2017 ఫిలింఫేర్‌ లో హీరోయిన్స్ హాట్ ఫోజులు(ఫొటోలు)

ఎక్సపెక్ట్ చేయం, మతిపోగొట్టారంతే: 2017 ఫిలింఫేర్‌ లో హీరోయిన్స్ హాట్ ఫోజులు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ముంబయిలో 62వ ఫిలింఫేర్‌ ఫెస్టివల్ సందడిగా జరిగింది. ఆమీర్‌ ఖాన్‌ మల్లయోధుడి పాత్రలో నితేష్‌ తివారి తెరకెక్కించిన 'దంగల్‌' ఫిలింఫేర్‌ పురస్కారాల్లో సత్తా చాటింది. ఈ వేడుకలో 'దంగల్‌' ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు ఆమీర్‌ ఉత్తమ నటుడిగా, నితేష్‌ తివారి ఉత్తమ దర్శకుడిగా పురస్కారాలు దక్కించుకున్నారు.

ఉత్కంఠ రేకెత్తించే మల్లయుద్ధ సన్నివేశాలతో తెరకెక్కిన 'దంగల్‌'కు ఉత్తమ పోరాటాల విభాగంలోనూ పురస్కారం దక్కింది. 'ఉడ్తా పంజాబ్‌'లో నటనకుగాను ఆలియా భట్‌కు ఉత్తమ నటి పురస్కారం దక్కింది.

ఉత్తమ సహాయ నటుడుగా రిషి కపూర్‌ (కపూర్‌ అండ్‌ సన్స్‌), ఉత్తమ సహాయ నటిగా షబానా అజ్మీ (నీర్జా) నిలిచారు. 'పింక్‌', 'కపూర్‌ అండ్‌ సన్స్‌', 'యే దిల్‌ హై ముష్కిల్‌', 'సుల్తాన్‌', 'ఫ్యాన్‌' చిత్రాలకు వివిధ విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.

'ఫిలింఫేర్‌ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని శత్రుఘ్న సిన్హాకు అందజేశారు. క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో ఉత్తమ నటుడు పురస్కారాన్ని షాహిద్‌ కపూర్‌ (ఉడ్తా పంజాబ్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌ (అలీఘర్‌) పంచుకోగా, ఉత్తమ నటిగా సోనమ్‌ కపూర్‌ (నీర్జా) నిలిచింది. ఉత్తమ చిత్రం పురస్కారం 'నీర్జా'కు దక్కింది.

హీరోయిన్ ప్రీతి జింతా తన భర్తతో...

హీరోయిన్ ప్రీతి జింతా తన భర్తతో...

స్టార్ హీరోయిన్ ప్రీతి జింతా తన భర్తతో కలిసి ఈ వేడుకలో సందడి చేసింది. అందరి కళ్ళూ ఈ జంటపైనే ఉన్నాయి. ప్రీతి , ఆమె భర్త..అందంలో ఒకరికొకరు పోటీ పడ్డారనే కామెంట్స్ అంతటా వినిపించాయి. రహస్యంగా వివాహం చేసుకున్న ప్రీతి తన భర్తతో కలిసి పాల్గొన్న పంక్షన్ ఇది.

అక్కా చెల్లిళ్ళతో కలిసి సల్మాన్

అక్కా చెల్లిళ్ళతో కలిసి సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ..శెట్టి సిస్టర్స్ ఇద్దరితో కలిసి ఇలా ఫోజ్ ఇచ్చారు. శిల్పా శెట్టి, షమితా షెట్టి ఇద్దరూ సల్మాన్ తో కలిసి ఇలా స్టేజ్ ఎక్కటంతో అంతటా ఇదే చర్చగా మారింది. షెట్టి సిస్టర్స్ ఇద్దరూ హాట్ గా మెరిసిపోయారు. సల్మాన్ సరేసరి.

భార్యతో కలిసి

భార్యతో కలిసి

తొలిసారిగా షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజపుత్ తో కలిసి ఈ వేడకకు హాజరయ్యారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. షాహిద్ కపూర్ క్రేజ్ కు ఇదే నిదర్శనం అంటున్నారు బాలీవుడ్ పండితులు.

అలియాభట్

అలియాభట్

తన తల్లితో,సోదరితో కలిసి అలియా భట్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఏక్ట్రెస్ అవార్డ్ కు అలియా భట్ ఎంపిక అయ్యారు. పింక్ కలర్ లో అలియా మెరిసిపోయిందంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఆమె చూడముచ్చటగా కనిపించింది.

 స్టైల్ కింగ్

స్టైల్ కింగ్

బాలీవుడ్ స్టైల్ కింగ్ గా చెప్పబడే సిద్దార్ద మల్హోత్రా ఇదిగో ఇలా ఈ వేడకకు హాజరయ్యారు. మీడియాతో తదనంతరం మాట్లాడుతూ ఈ పంక్షన్ కు హాజరవ్వటం తనకు ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు. సిద్దార్ద అభిమానులు పండగ చేసుకున్నారు.

కేక పెట్టించారు

కేక పెట్టించారు

ఉత్తమ నటిగా నీర్జా చిత్రానికి గానూ సోనమ్‌ కపూర్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు జాక్విలిన్ ఇలా ఈ వేడకలో రెడ్ కార్పెట్ పై మెరిసింది. అందరు దృష్టి తనవైపుకి తిప్పుకోగలిగారు ఈ హీరోయిన్స్ ఇద్దరూ. అదరకొట్టారు కదా తమ డ్రస్ లతో ..

లవ్ బర్డ్స్ ఇద్దరూ

లవ్ బర్డ్స్ ఇద్దరూ

సుశాంత్ సింగ్ రాజపుట్, కీర్తి సనమ్ ఇద్దరూ కూడా ఈ వేడుకలో మెరిసారు. బయిట లవ్ బర్డ్స్ గా చెప్పబడుతున్న ఈ దంపతులు బ్లాక్ డ్రస్ లో మెరిసిపోయారు. అణువణువు హాట్ గా మెరిసిపోయారు ఈ జంట అనటంలో సందేహం లేదు.

ఆ ఇద్గరే...

ఆ ఇద్గరే...

బాలీవుడ్ లో తొలి చిత్రంతోనే దుమ్ము రేపిన మీర్జా జంట సయామి ఖేర్, హర్ష వర్దన్ కపూర్ లు ఇదిగో ఇలా ఫిల్మ్ ఫేమ్ పంక్షన్ లో మెరిసారు. అందరూ వీరి తర్వాత సినిమా ఏంటన్నట్లు గుసగుసలాడారు. సినిమా ఆడి ఉంటే భలే క్రేజ్ వచ్చి ఉండేదే..అయ్యో అనేసారు.

హైలెట్

హైలెట్

ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. డర్టీ పిక్చర్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన విద్యాబాలన్ ..బ్లాక్ శారీలో ఈ వేడుకకు వచ్చి దుమ్ము రేపింది. ఈ పిల్మ్ అవార్డ్ ల పంక్షన్ కే స్పెషల్ గా మారింది. విద్యా అంటే అంతే అంటున్నారు అంతా.

పరిణితి చోప్రా

పరిణితి చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా చాలా క్యూట్ గా ఉంటుందనటంలో సందేహం లేదు. అలాంటి పరిణితి ఇక పంక్షన్ కు అంటే ఎలా వస్తుంది. అదే స్దాయిలో కుర్రకారుకు మతి పోగెట్టేలా వచ్చేసింది. ఆమె అందం అక్కడ హాట్ గా వెలిగిపోయిందంటే అతిశయోక్తి కాదు.

హీరో దుమ్మురేపాడు

హీరో దుమ్మురేపాడు

ఎంతసేపూ హీరోయిన్స్ గురించేనా మరి హీరోలు ఈ ఈవెంట్ కి వచ్చిన వాళ్ల గురించి చెప్పరా అంటే బాలీవుడ్ ని ఏలుతున్న వరుణ్ ధావన్ గురించి చెప్పాలి. వరుణ్ ఈ పంక్షన్ లో రెడ్ కార్పెడ్ మీద ఇదిగో ఇలా ఫ్యాన్స్ ని అలరించారు.

మస్త్ మస్త్ గర్ల్

మస్త్ మస్త్ గర్ల్

బాలీవుడ్ మస్త్ మస్త్ గర్ల్ రవీనా టాండన్ రవీనా టాండన్. అదేనండీ మన బాలయ్య బంగారు బుల్లోడు సినిమాలో చేసిన బుల్లెమ్మ ఇదిగో ఇలా దుమ్ము రేపింది. ఆమె ఈ పంక్షన్ లో మెరిసిపోయింది. సీనియర్ హీరోయిన్ అయినా ఏలుతున్న హీరోయిన్స్ కు పోటి ఇచ్చింది.

ఈ హీరోయిన్స్ ఎవరో తెలుసా

ఈ హీరోయిన్స్ ఎవరో తెలుసా

ఇక్కడ బ్లాక్ డ్రస్ లో మెరిసిపోతున్న హీరోయిన్స్ ని గుర్తు పట్టారా.. వయస్సుతో సంభందం లేకుండా తమ గ్లామర్ ని కాపాడుకుంటూ వస్తున్న సోనాలి బింద్రే,శ్రీదేవి, భూమి పెండేకర్ లు. వీళ్లు అందచందాలు చూపరలుకు ఆశ్చర్యం కలిగించాయి.

వీళ్లంతా..

వీళ్లంతా..

ఇక ఈ పంక్షన్ లో సోనాక్షి సిన్హా మెరుపులు గురించి అయితే ఓ పుస్తకమే రాయచ్చు. ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా షారుఖ్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, కపిల్‌ శర్మ సరదా సంభాషణలతో రక్తికట్టించారు. సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా, ఆలియా భట్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ ధావన్‌, టైగర్‌ ష్రాఫ్‌ తమ డ్యాన్సులతో హుషారు నింపారు. కార్యక్రమంలో శ్రీదేవి, విద్యా బాలన్‌, పరిణీతి చోప్రా, శిల్పా శెట్టి, కృతి సనన్‌, సయామీ ఖేర్‌ తదితరులు తళుక్కున మెరిశారు.

English summary
The very first award show of 2017, 'Jio Filmfare Awards' has kickstarted and the entire B-town has gathered under one roof, in their most stylish avatar! From Salman Khan, Shahrukh Khan to Sushant Singh Rajut, from Preity Zinta-Gene Goodenough to Shahid Kapoor-Mira Rajput, from Sonam Kapoor to Saiyami Kher, most of the celebs from the B-town are in attendance and we're loving their stunning avatars!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more