twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదలైన రోజు నేరుగా ఇంట్లోనే సినిమా.. జియో గిగా దెబ్బకు వణికిపోతున్న మాల్స్

    |

    Recommended Video

    Jio's First Day First Show Movie Plan May Effects The Malls And Food Courts || Filmibeat Telugu

    టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది రిలయన్స్ జియో. ఇప్పటికే పలు టెలికాం సంస్థలకు చుక్కలు చూపిస్తూ వ్యాపార విస్తరణ చేసిన రిలయన్స్ జియో.. జియో గిగా ఫైబర్ ద్వారా మొబైల్, ఇంటర్నెట్, టీవీ సేవలను ఒకే తాటిపైకి తీసుకొస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ సోమవారం (ఆగస్ట్ 12) సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్ సంస్థ చేసిన ఈ ప్రకటనపై ఆర్ధిక విశ్లేషకులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పలు మల్టిప్లెక్స్ యజమానులు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ వారంతా చెబుతోందేంటి? వివరాల్లోకి పోతే..

    ఫస్ట్-డే ఫస్ట్-షో ప్లాన్

    ఫస్ట్-డే ఫస్ట్-షో ప్లాన్

    రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క "ఫస్ట్-డే ఫస్ట్-షో" మూవీస్ ప్లాన్ గురించి ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారిక ప్రకటన ఇచ్చారు. జియో First Day First Show (ఫస్ట్ డే ఫస్ట్ షో) ఆఫర్ ద్వారా విడుదలైన ఏ సినిమానైనా మొదటి రోజే ఇంట్లోనే కూర్చొని చూడొచ్చని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

    సినీ మాల్స్‌కి ఎదురుదెబ్బ

    సినీ మాల్స్‌కి ఎదురుదెబ్బ

    విడుదల రోజే ఇంట్లో కూర్చొని సినిమా చూసేసే సదుపాయం కల్పించడం అనే సినీ మాల్స్ ఆదాయానికి గండి కొడుతుందని అంటున్నారు. ఈ ఆఫర్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపగలదని మరియు ఆదాయ ప్రవాహాలను దెబ్బతీస్తుందని కొందరు చెప్పుకుంటున్నారు. థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గటం ద్వారా సినీ మాల్స్, ఫుడ్ జంక్షన్స్ తమ ఆదాయాన్ని కోల్పోనున్నాయనే టాక్ వినిపిస్తోంది.

    డిఎల్ఎఫ్ మెగా మాల్ ఫుడ్ కోర్ట్ డైరెక్టర్

    డిఎల్ఎఫ్ మెగా మాల్ ఫుడ్ కోర్ట్ డైరెక్టర్

    రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన ఈ ఆఫర్ పై గుర్గావ్ లోని డిఎల్ఎఫ్ మెగా మాల్ లో ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్న క్వాల్స్ గ్రూప్ డైరెక్టర్ సమీర్ లాంబా స్పందిస్తూ "ఫస్ట్-డే ఫస్ట్-షో'' ఆఫర్ కారణంగా ఫుడ్ కోర్టుల వ్యాపారంపై 10% మేర ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

    న్‌ఆర్బిట్స్ మాల్స్ సిఇఒ రజనీష్ మహాజన్

    న్‌ఆర్బిట్స్ మాల్స్ సిఇఒ రజనీష్ మహాజన్

    రిలయన్స్ ప్రకటించిన ఈ ఆఫర్ సినిమా యొక్క షెల్ఫ్ లైఫ్‌తో పాటు మల్టీప్లెక్స్‌లు మరియు మాల్‌లకు వచ్చే వారి సంఖ్యపై కొంత ప్రభావం చూపుతుందని ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఇన్‌ఆర్బిట్స్ మాల్స్ సిఇఒ రజనీష్ మహాజన్ అన్నారు. మొదటి రోజు సినిమా చూసేందుకు రిలయన్స్ ఏ ధరలను నిర్ణయిస్తుంది, ఎలాంటి సినిమాలు అందుబాటులో ఉంటాయనే దానిపై ప్రభావం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.

    కెఎఫ్‌సి ఇండియా ఎండి సమీర్ మీనన్

    కెఎఫ్‌సి ఇండియా ఎండి సమీర్ మీనన్

    మాకున్న రెస్టారెంట్లలో సగం సినీ మాల్స్ లోపల ఉన్నందున ఆ ప్రభావం తమపై పడుతుందని, వందలాది మల్టీప్లెక్స్‌లలో ఫుడ్ సేవలు అందిస్తున్న తమకు ఇది ఎదురుదెబ్బ అని కెఎఫ్‌సి ఇండియా ఎండి సమీర్ మీనన్ అన్నారు.

    2020 సంవత్సరం మధ్యలో అందుబాటులోకి

    2020 సంవత్సరం మధ్యలో అందుబాటులోకి

    ఆర్‌ఐఎల్ తన 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా ప్రకటించబడిన ఫస్ట్ డే ఫస్ట్-షో మూవీస్ సేవలు 2020 సంవత్సరం మధ్యలో అందుబాటులోకి రానున్నాయి. జియో గిగాఫైబర్ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ప్యాకేజీతో ఈ సేవలు కల్పించనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్.

    English summary
    RIL announced at its 42nd annual general meeting on Monday that its first-day first-show movies service will be launched mid-2020 for its premium Jio Gigafiber customers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X