»   » జూ. ఎన్టీఆర్ ....ప్లేబాయ్ (కన్ఫర్మ్ న్యూస్)

జూ. ఎన్టీఆర్ ....ప్లేబాయ్ (కన్ఫర్మ్ న్యూస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఎన్టీఆర్ త్వరలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో త్వరలో రూపొందుబోతున్న రభస చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఓ ప్లేబాయ్‌ తరహాలో ఎంటర్టైన్మెంట్ పండిస్తుందని చెప్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియచేసారు.

శ్రీనివాస్ మాటల్లోనే... 'రభస' పేరుతో తెరకెక్కనున్న ఆ చిత్రం వచ్చే నెల 2నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

అలాగే... ''మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో కథానాయకుడు ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.

English summary
Rabhasa is a action entertainer movie in which Jr Ntr will playing the main lead role along with Samantha in female lead. Kandireega fame Santosh Srinivas will be directing this movie under Bellamkonda Suresh's Sri Lakshmi Narasimha Productions banner. Devi Sri Prasad scoring music for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu