»   » భాగ్యనగరంలోనికి ఎంటర్ అయిన యంగ్ టైగర్...

భాగ్యనగరంలోనికి ఎంటర్ అయిన యంగ్ టైగర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'శక్తి" సినిమా షూటింగ్ కోసం కులుమనాలీ, హరిద్వార్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. హైదరాబాద్ ను ఇన్ని రోజులు మిస్ అయినందుకు బాధ పడిన ఎన్టీఆర్ మనాలీలో షూటింగ్ ముగియడంతో ఆనందంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అడుగు పెట్టాడు యంగ్ టైగర్. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే తనకు కొత్త ఉత్సాహం వచ్చిందని ఎన్టీఆర్ తెలిపాడు. వారం పాటు విశ్రాంతి తీసుకుని 'బృందావనం" షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

బృందావనం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ఈ నెల 18 నుంచి జరుగనుంది. రెండు చిత్రాలను ఏకకాలంలో పూర్తి చేయడం విశేషం. బృందావనం చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ శంషాబాద్‌లో జరిగింది. ఇంకా రెండు పాటలు కొంత ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంది. వీటిని ఈ నెలఖారులో పూర్తి చేయనున్నారు. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu