»   » మనోజ్ బిహేవియర్ పై జూ ఎన్టీఆర్ కామెంట్

మనోజ్ బిహేవియర్ పై జూ ఎన్టీఆర్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్ తనకు చిన్నప్పటినుంచి బామిగా తెలుసు అని,అతనిచ్చే కిక్ ఓ రకంగా ఉంటుందని అన్నారు ఎన్టీఆర్. మంచు లక్ష్మి చేస్తున్న ఓ ఛాట్ షో లో ఎన్టీఆర్ మాట్లాడుతూ..మనోజ్ మొదట నుంచి తనకు కిక్ కోసం ఏదైనా చేయటానికి వెనకాడడని అన్నారు.దాన్ని మంచు లక్ష్మి కూడా సమర్ధించింది.అతని ఎనర్జి,స్టైల్ తనకు ఇష్టమని అన్నారు.అలాగే కిక్ సినిమాలో వేణు మాధవ్ పాత్ర రవితేజ గురించి చెప్పినట్లు మంచు మనోజ్ పాత్ర ఉంటుందని,చిన్నప్పటి నుంచి అలాగే బిహేవ్ చేసేవాడని ఎన్టీఆర్ నవ్వుతూ చెప్పారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఊసరవిల్లి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర విలక్షణంగా ఉంటుందని సురేంద్ర రెడ్డి చెప్తున్నారు. ఆయన పాత్ర గురించి చెబుతూ..యుద్ధంలో గెలవాలంటే రెండే రెండు మార్గాలు. బలం, బలగం సరిపోతాయి అనుకొంటే సైనికుడై దూకాలి. అవి చాలని పక్షంలో మెదడుకు పదును పెట్టాలి. పరిస్థితిని బట్టి మారాలి... అవసరమైతే శత్రువులను ఏమార్చాలి. మా కథానాయకుడు రెండో మార్గాన్నే ఎంచుకొన్నాడు. మరి రణ రంగంలో వీరుడై ఎలా నిలిచాడో తెలియాలంటే ఎన్టీఆర్‌ కొత్త చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే అన్నారు.తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

English summary
During the presence at a chat show on small screen, NTR shared his opinion on few of those Kicking people whom he met in life. Yes, first in his list would be Manchu Manoj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu