»   »  రెండు కళ్లను కోల్పోయాం: జూ ఎన్టీఆర్

రెండు కళ్లను కోల్పోయాం: జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావును కోల్పోయిన ఈ రోజును దుర్దినంగా పేర్కొన్నారు యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్. అక్కినేని భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం సందర్శించిన ఆయన మాట్లాడుతూ అక్కినేని మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న రెండు కళ్లను కోల్పోయినట్లయిందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయాల గురించి కానివ్వండి, ఒక మహా మనిషిగా కానివ్వండి ఆయన గురించి మాట్లాడే అర్హత తనకు లేదని అన్నారు జూ ఎన్టీఆర్. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన చూపు కుటుంబం వైపు, ఇండస్ట్రీ వైపు ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Jr NTR condolences to ANR family

సినీ రచయిత, నటుడు రావి కొండలరావు మాట్లాడుతూ....ఏఎన్ఆర్ మొదటి నండి నన్ను ప్రోత్సహించారు. నేనన్నా, నా భార్య అన్నా అభిమానం. నన్ను ఎంతగానో ఆదరించారు. గొప్ప సంస్కార వంతుడు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఏమీ రాని వ్యక్తి ఎన్నో నేర్చుకున్నారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో ఓ మహా వట వృక్షం వెళ్లి పోయింది. నన్ను ఆయన ప్రోత్సహించకుంటే నేను ఎక్కడ ఉండే వాడినో అని వ్యాఖ్యానించారు.

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ...ఆయన నిండు నూరేళ్లు ఉంటారని అనుకున్నాం. గొప్ప నటుడు, గ్రేటెస్ట్ మ్యాన్. ఆయన ఆకస్మికర మరణం దురదృష్టం. బాబు మోహన్ మాట్లాడుతూ.....మొన్ననే ఆయన సెంచరీ కొడతానని చెప్పారు. ఇంతలోనే ఇలాంటి విషాదం చోటు చేసుకుంటుందని ఊహించలేదు అన్నారు.

English summary
Actor Jr NTR condolences to ANR family. Legendary actor Akkineni Nageshwar Rao (90) passed away on Tuesday night. He was battling with cancer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu