‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

డిస్ట్రీబ్యూటర్‌గా, నిర్మాతగా ఎన్నో సినిమాలను అందించారు సీనియర్ ప్రొడ్యూసర్ దొరస్వామి రాజు. సుదీర్ఘ కాలం పాటు చిత్ర పరిశ్రమ కోసం పని చేసిన ఆయన.. సోమవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడా ప్రొడ్యూసర్ మరణంపై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దొరస్వామి రాజు ఆకస్మిక మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో 'దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. 'సింహాద్రి' చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అంటూ రాసుకొచ్చాడు తారక్. అతడితో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా దొరస్వామి రాజు మరణంపై ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సంతాపం తెలియజేశారు.

Jr NTR Condolences to VMC Doraswamy Raju Death

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 'సింహాద్రి' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, ఎన్నో రికార్డులను తిరగరాసింది. దీన్ని దొరస్వామి రాజే నిర్మించారు. ఇదిలా ఉండగా, సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు దొరస్వామి రాజు. 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు మెంబర్‌గానూ వ్యవహరించారు. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ కారణంగానే రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X