»   » బాలయ్య కు బ్లాక్‌ బస్టర్‌ హిట్ ఇచ్చి డైరెక్టర్ ని ముప్పతిప్పలు పెడుతున్న జూ ఎన్టీఆర్

బాలయ్య కు బ్లాక్‌ బస్టర్‌ హిట్ ఇచ్చి డైరెక్టర్ ని ముప్పతిప్పలు పెడుతున్న జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస ఫ్లాప్‌ లతో సతమతమవుతున్న నందమూరి బాలకృష్ణకు 'సింహా" వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చే నెక్ట్స్ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్‌ లో రాబోవు చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇటీవల బోయపాటి శ్రీను ఎన్టీఆర్‌ కు తన దగ్గరున్న కథ లైన్స్‌ ను చెప్పగా..ఆ లైన్స్‌ ఎన్టీఆర్‌ కు నచ్చలేదట. ఈ వార్త తెలిసిన కొంతమంది సినీ ప్రముఖులు పాపం 'సింహా" లాంటి హిట్‌ ఇచ్చిన బోయపాటి శ్రీనును ఎన్టీఆర్‌ కథ నచ్చలేదంటూ ముప్పతిప్పలు చెడుతున్నాడు అని అంటున్నారట. ఇక ఎన్టీఆర్‌ నటించిన 'బృందావనం" అక్టోబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ చిత్రంతో పాటు ఆయన నటిస్తున్న మరో చిత్రం 'శక్తి" షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu