»   » రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో.. ఈ జన్మలో మీ అందరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం దక్కిందని అన్నారు.

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్నా.... ఇంకో జన్మ ఉంటే మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మ మాత్రం వీళ్లతో(అభిమానులు) ఉండిపోతాను. ఒక తల్లి కడుపున పుట్టక పోయినా మీరు చూపించే అభిమానం, ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. మీ అందరి రూపంలో ఇంత గొప్ప కుటుంబం దొరికింది... అని ఎన్టీఆర్ అన్నారు.


మీ దగ్గర ప్రయత్నించడం ఉండదు

మీ దగ్గర ప్రయత్నించడం ఉండదు

ఒక మంచి భర్తగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తండ్రిగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి కొడుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తమ్ముడిగా ఉండటానికి ప్రయత్నిస్తాను...కానీ మీ(అభిమానులు) దగ్గర మాత్రం ప్రయత్నించడం ఉండదు. మీ దగ్గర ఎప్పుడూ ఎమోషనే ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.


 రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతానని మనవి చేసుకుంటున్నాను. నాకు ఎవరూ ముఖ్యం కాదు, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే ముఖ్యం. మీకు నచ్చే వరకు, మీరు గర్వంగా తలెత్తుకుని తిరిగే వరకు ఎల్లప్పుడూ ఇలాగే పోరాడూతూనే ఉంటాను. మంచి చిత్రాలు తీసి మీ రుణం తప్పకుండా ఈ జన్మలో తీర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకో జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా మీ రుణం తీర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు... అని ఎన్టీఆర్ అన్నారు.


అందుకే పదాలు ఏరుకుంటున్నాను

అందుకే పదాలు ఏరుకుంటున్నాను

జై లవ కుశ గురించి ఎలా మాట్లాడాలి అని పదాలు వెతుక్కుంటున్నాను. ఎప్పుడూ ఇలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. బహుషా లోపల ఉన్నటువంటి ఎమోషన్ వల్ల బయటకు రావడం లేదేమో, అందుకే ఏరుకుంటున్నాను పదాలను, ఈ రోజు వచ్చినటువంటి ఈ స్థాయి దేవుడు చల్లగా చూశాడు, అభిమానులు ప్రోత్సహించారు, మా దర్శకులు ఫోకస్డ్ గా ఉన్నారు కాబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉండగలిగాను, ఈ మూడింటిలో ఏ ఒక్కటి తక్కువైనా నిజంగా ఈ రోజు జై లవ కుశ అనే సినిమా ఉండేది కాదేమో.... అని ఎన్టీఆర్ అన్నారు.


హిట్లు, ప్లాపులు దైవ నిర్ణయం

హిట్లు, ప్లాపులు దైవ నిర్ణయం

నేను, అన్నయ్యా ఎప్పుడైతే మా బేనర్లో సినిమా చేద్దామని అనుకున్నామో ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. సినిమా హిట్టు, ప్లాపులు మన చేతుల్లో లేవు, అది దైవ నిర్ణయం, మనం ప్రయత్నం మాత్రమే చేయగలం, ఈ చిత్రం విషయంలో సక్సెస్ కంటే ముఖ్యం అభిమానులు గర్వంగా సినిమా చూసిన తర్వాత ఏం తీశార్రా అన్నాదమ్మలు అని వాళ్లు అనుకోవాలి. ఎంత బాగా తీశార్రా మా కన్నకొడుకులు అని అమ్మా నాన్నా అనుకోవాలి. వీటన్నింటికంటే మనిద్దరం అద్భుతమైన సినిమా తీశామని నేను అన్నయ్య అనుకోవాలి. అవన్నీ దేవుడు విని బాబీని పంపించాడేమో.... అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.


బాబీ కథ చెప్పగానే భయపడిపోయాను

బాబీ కథ చెప్పగానే భయపడిపోయాను

ఎప్పుడైతే బాబీ వచ్చి కథ చెప్పాడో భయపడిపోయాను. ముందు భయం వేసింది. ఈ చిత్రం చేయగలుగుతానా? అని... నేను, అన్నా ఏదైతే అనుకున్నామో, మా డ్రీమ్ కు కావాల్సిన ఆయుధాలన్నీ ఆయన తీసుకొచ్చిన కథలో ఉన్నాయి... అని ఎన్టీఆర్ తెలిపారు.
ఆ ఇద్దరి పేర్లు సినిమా హిట్టయితే చెబుతా

ఆ ఇద్దరి పేర్లు సినిమా హిట్టయితే చెబుతా

ఈ కథను నాకు అత్యంత దగ్గరైనటువంటి ఇద్దరు ఆప్తులతో షేర్ చేసుకున్నాను. వారి పేర్లు ఇపుడు చెప్పను, ఈ సినిమా సూపర్ హిట్టయితే వారి పేర్లను చెబుతాను. అప్పటి వరకు వారిద్దరి పేర్లు చెప్పను. వారిద్దరితో నేను ఎప్పుడైతే కథ షేర్ చేసుకున్నానో వాళ్లు కూడా బ్రహ్మాండంగా ఉందని ప్రోత్సహించడం జరిగింది. ఈ సినిమా మీ అందరికీ గర్వకారణంగా ఉన్న రోజే చెబుతాను వారిద్దరూ ఎవరు? అనేది.... అని ఎన్టీఆర్ అన్నారు.


ఎంతకష్టమైనా అభిమానుల కోసమే

ఎంతకష్టమైనా అభిమానుల కోసమే

‘జై లవ కుశ' ప్రయాణం మొదలైనప్పటి నుండి మీ అందరికీ గర్వకారణంగా ఉండాలనే ఒక ఫినిష్ లైన్ తప్ప ఏమీ కనిపించలేదు. రోజూ పొద్దున్నే లేచి పరుగెత్తాం, ఎంత కష్టమైనా సరే పర్లేదు. చివరకు ఈ రోజు ఇలా మీ అందరి ముందు రావడం జరిగింది. బావుంటుందని నమ్ముతున్నాను. తప్పకుండా మీ అందరికీ గర్వకారణంగా ఉంటుంది, మా అమ్మ నాన్నలకు, నాకు, అన్నకు గర్వ కారణంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీగతాదంతా పైవాడి చేతుల్లో ఉంది, మా ఆరాధ్య దైవం తాతగారి చేతుల్లో ఉంది, వారి ఆశీర్వాదం తోడైతే మేము కన్న కల కూడా నిజమౌతుంది అని మనసారా నమ్ముతున్నాను... అని ఎన్టీఆర్ అన్నారు.


మొదట ఫైనలైజ్ చేసిన టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్

మొదట ఫైనలైజ్ చేసిన టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్

ఎప్పుడైతే మేము ఈ సినిమా చేయాలనుకున్నామో అంతా కలిసి ఒకే మాటపై వచ్చి ఫైనలైజ్ చేసిన ఫస్ట్ టెక్నీషియన్ మా దేవిశ్రీ ప్రసాద్. మా రిలేషన్ ఎలా ఉంటుందో దేవి ఇచ్చే పాటలతోనే తెలుస్తుంది... అని ఎన్టీఆర్ అన్నారు.


చోటన్న ప్రెషర్ అంతా ఆయన భుజాలపై

చోటన్న ప్రెషర్ అంతా ఆయన భుజాలపై

అలాగే మా చోటన్న.... ఆయన డిఓపీగా పని చేస్తే అందరూ రిలాక్స్ అవ్వొచ్చు. చోటాగారు మొత్తం ప్రెషన్ ఆయన భుజాలపై వేసుకుంటారు. ఈ రోజు సినిమా అనుకున్న సమయానికి వస్తుందంటే ముఖ్యమైన కారణం చోటా గారు. ఎన్నో విషయాలు ఆయన తన భుజాలపై వేసుకున్నారు. పూణెలో చేసిన షెడ్యూల్ లో 19 రోజుల పాటు చోటగారు పడిన కష్టం మాటల్లో చెప్పలేను. ఈ సినిమాకు ముఖ్యమైన పిల్లర్లలో ఆయన ఒకరు... అని ఎన్టీఆర్ అన్నారు.


ఈ సినిమాకు ముఖ్యమైన పిల్లర్స్

ఈ సినిమాకు ముఖ్యమైన పిల్లర్స్

అలాగే కోన, చక్రి.... బాబీ తీసుకొచ్చిన కథకు, కష్టానికి కుడి భుజం, ఎడమ భుజంగా సపోర్టు చేశారు. అలాగే మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ ప్రసాద్ గారు మరో పిల్లర్. అలాగే రామ్ లక్ష్మణ్ బ్రదర్స్... ఈ సినిమాకు ముఖ్యమైన వ్యక్తులు అని ఎన్టీఆర్ అన్నారు.


మూడు పాత్రలు, 38 షాట్లు

మూడు పాత్రలు, 38 షాట్లు

మూడు పాత్రలు చేపుడు 38 విఎఫ్ఎక్స్ షాట్స్ చేయాల్సి వచ్చింది. 38 విఎఫ్ఎక్స్ షాట్స్ అంటే ఒక్కో పాత్ర మూడు సార్లు బట్టలు మార్చాలి. 76 సార్లు బట్టలు మార్చేపుడు నిజంగా ఒక్కోసారి బాధగా ఉండేది. అదే సమయంలో అభిమానులకు నచ్చాలి, వారి కోసం కష్టపడాలి అని అనిపిస్తూ ఉండేది. నాకు సపోర్టుగా నిలిచిన రాశి, నివేదా లకు థాంక్స్. వారి సపోర్టు ఎప్పటికీ మరిచిపోలేను... అని ఎన్టీఆర్ అన్నారు.


అందరికీ ధన్యవాదాలు

అందరికీ ధన్యవాదాలు

అలాగే ఈ చిత్రానికి పని చేసిన సాయి కుమార్ గారికి, పోసాని కృష్ణ మురళి గారికి, ఇంకా ఎంతో మంది నటీనలులకు, సాంకేతిక నిపుణులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం మనందరి గుండెల్లో సుస్థిర స్థానం ఉండిపోతుందనే నమ్మకం ఉంది. జై లవ కుశ అనేది కేవలం జై సినిమా కాదు... ఈ చిత్రంలో ఏ ఒక్క పేరు లేక పోయినా అది కరెక్ట్ అవ్వదు. ఈ చిత్రం ప్రపంచంలో ఉన్న అన్నదమ్ములందరికీ అంకితం. ఈ చిత్రం చూసి అన్నదమ్ములందరూ కూడా ఇన్స్ స్పైర్ అవుతారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.. అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.English summary
Jr NTR Fully Emotional Speech at Jai Lava Kusa theatrical trailer launch Event. Jai Lava Kusa is an upcoming Telugu language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu