»   » జూ ఎన్టీఆర్ తో పోటీ పడి డాన్స్ చేయడమంటే చిన్న విషయం కాదు..!

జూ ఎన్టీఆర్ తో పోటీ పడి డాన్స్ చేయడమంటే చిన్న విషయం కాదు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ విషయంలో ఎన్టీఆర్ తోనే సుఖమని చెబుతోంది హీరోయిన్ ప్రియమణి, ఏ విషయంలో అని అడిగితే, డాన్సుల్లోనని అసలు విషయం లేటుగా చెప్పింది. 'డాన్సుల్లో జూ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అతనితో పోటీ పడి డాన్స్ చేయడమంటే చిన్న విషయం కాదు. అలాంటింది జూ ఎన్టీఆర్ తో షెబాష్ అన్సించుకున్నా..అదో గొప్ప కాంప్లిమెంట్.."అంటూ యమదొంగ నాటి 'మధురానుభూతుల్ని" ఇప్పడు నెమరువేసుకుంటోంది ప్రియమణి. తాను ఇప్పటికీ జూ ఎన్టీఆర్ ని రెగ్యులర్ గా కలుస్తుంటాననీ, 'యమదొంగ" నాటి స్వీట్ మెమరీస్ ని పంచుకుంటామని ప్రియమణి అంటోంది. డాన్సులేసేటప్పుడు జూ ఎన్టీఆర్ తనకు చాలా సలహాలిచ్చాడనీ, తాను స్వతహాగా డాన్సర్ ని కావడంతో తన డాన్స్ నీ తన్మయత్వంతో జూ ఎన్టీఆర్ ఎంజాయ్ చేసేవాడనీ సెలవిచ్చింది ప్రియమణి. అందుకే కదా..ఆ పరిచయంతోనే కదా, బాబాయ్ బాలయ్య హీరోగా తెరకెక్కిన 'మిత్రుడు" సినిమాకి నిన్నురికమెండ్ చేసింది ..అంటూ ప్రియమణి మాటల్ని విన్నవారు కౌంటర్లు విసురుతున్నారు.

English summary
It is known news that Actress Priyamani paired up with Jr Ntr in 'Yamadonga' film. Recently remembering the shooting days of 'Yamadonga' film, Actress said that she likes to work with Jr Ntr it seems. She said that Jr Ntr is extra-ordinary in doing dance and given me some suggestions while dancing together for a song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu