»   » యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సెన్సేషనల్ డెసిషన్స్ తెలుసుకోవాలంటే...!?

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సెన్సేషనల్ డెసిషన్స్ తెలుసుకోవాలంటే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ఇటు 'బృందావనం" అటు 'శక్తి" చిత్రాల షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాడు నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇలా ఎన్టీఆర్ ఒకేసారి రెండు సినిమాలు చేయడం తన అభిమనులకు ఆనందాన్నిస్తున్నా ఆ తర్వాత వచ్చే చిత్రాల విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొని వుందని చెప్పాలి. 'సింహా" దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్టర్ గా కె.ఎస్ రామారావు బేనర్ లో ఎన్టీఆర్ చేసే సినిమాని దసరాకి మొదలు పెట్టాలనుకున్నారు కానీ దానికిప్పటి వరకూ కథ ఓకే కాలేదు.

సురేందర్ రెడ్డి చెప్పిన కథ విని ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యాడు కానీ తదుపరి పరిణామాల వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో జరిగేలా లేదు. అలాగే ఎన్టీఆర్-రాజమౌళిల సూర్ కాంబినేషన్ లోనూ ఓ సినిమాను చేయాల్సి ఉన్నప్పటికీ అది కూడా మరో ఒక సంవత్సరం వాయిదా పడింది. మరైతే బృందావనం, శక్తి చిత్రాల తర్వాత ఎన్టీఆర్ చెయ్యనున్న సినిమాలేంటీ అంటారా..ప్రస్తుతం ఎన్నో మార్సులు ఏర్సడుతోన్న ఎన్టీఆర్ తదుపరి చిత్రాల వివరాల కోసం, యంగ్ టైగర్ సెన్సేషనల్ డెసిషన్స్ తెలుసుకోవడం కోసం నెక్స్ ట్ అప్ డేట్ వరకూ వేచి చూడాల్సిందే...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu