»   » జూ ఎన్టీఆర్ ప్రక్కన క్యూటి ‘తాప్సీ’ ఎలా ఉంటుంది..!?

జూ ఎన్టీఆర్ ప్రక్కన క్యూటి ‘తాప్సీ’ ఎలా ఉంటుంది..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఝమ్మంది నాదం' చిత్రం స్టిల్స్ బయటకు రాగానే అందరి దృష్టి ఆ సినిమా హీరోయిన్ తాప్సీ పై పడ్డాయి. జెనీలియా తర్వాత చాలా క్యూటి బబ్లీ గా కనపడే ఈ క్యూటికి సినిమా విడుదల కాకముందే క్రేజి పెరిగిపోయింది. ఆల్ రెడీ ఆమె ప్రబాస్, నాగార్జున సినిమాలలో నటించుటకు అంగీకరించినట్టు సమాచారం. అయితే జూ ఎన్టీఆర్ ప్రక్కన నటిస్తే ఎలా ఉంటుందో ఒక క్లాస్ ఒక మాస్ ను చూస్తే ఎలా ఉంటుందో అలా చూడాలని లక్ష్మీప్రసన్న సన్నాహాలు మొదలు పెట్టింది.

లక్ష్మీ ప్రసన్న ఫుల్ టైమ్ నిర్మాతగా మారి వెంటవెంటనే తెలుగు సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రస్తుతం కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆమె నిర్మిస్తున్న 'ఝమ్మంది నాదం" సినిమా విడుదలకు సిద్దమయ్యింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, సిద్దార్థలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతోందట లక్ష్మి. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రస్తుతం క్రేజ్ హీరోయిన్ తాప్సీని ఎన్టీఆర్ పక్కన నటింపజేయాలని లక్ష్మీప్రసన్న అనుకుంటోందట. తాప్సీ, లక్ష్మీప్రసన్న కు మధ్య ఓ కాంట్రాక్ట్ ఉందని సమాచారం. దీని ప్రకారం తాప్సీ లక్ష్మీ ప్రసన్న నిర్మించే మరి కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించాల్సి ఉందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu