బొమ్మరిల్లు ఎన్టీఆర్ వల్ల ప్లాప్ అయ్యుండేది.. ఆ నిర్ణయమే నిర్మాతను అలా చేసింది...
చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగలవని నీరూపించిన సినిమాల్లో బొమ్మరిల్లు ఒకటి. అసలు ఆ సినిమా హిట్ అవుతుందని కూడా పెద్దగా ఎవరు ఊహించి ఉండరు. కానీ నష్టాలు రాకుండా మంచి గుర్తింపు వస్తుందని ఆ సినిమా యూనిట్ గట్టిగానే నమ్మింది. ముఖ్యంగా దిల్ రాజు నమ్మినంతగా ఆ సినిమాను మరొకరు నమ్మలేదనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ కారణంగా ఆ సినిమా నిజంగానే ప్లాప్ అయ్యి ఉండేదట. ఎన్టీఆర్ కూడా సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చాడు.
Recommended Video

నెగిటివ్ కామెంట్స్ గట్టిగానే వచ్చాయి..
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆ కథను రాసుకున్నప్పుడు అందరూ పాజిటివ్ గానే స్పందించినప్పటికి ఏ మాత్రం తేడా వచ్చినా అంతగా వర్కౌట్ కాదనే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చయట. కానీ దిల్ రాజు మాత్రం కొత్త దర్శకుడైన భాస్కర్ పై నమ్మకంతో స్టార్ హీరోలను సంప్రదించడం మొదలు పెట్టాడు.

నిర్మాతకు షాక్ ఇచ్చిన తారక్
ముందుగా ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ వద్దకు చేరుకుందట.యమదొంగ, అదుర్స్ వంటి సినిమాలతో అప్పుడే స్టార్ డమ్ పెంచుకున్న జూనియర్ ఎన్టీఆర్ బొమ్మరిల్లు సినిమా చేయడానికి మొదట చాలా ఇంట్రెస్ట్ చూపించాడట. కానీ ఆ తరువాత మళ్ళీ వెనుకడుగు వేసి సినిమా చేయలేను అని నిర్మాతకు షాక్ ఇచ్చాడట.

తప్పకుండా ప్లాప్ అయ్యి ఉండేదేమో..
ఒక విధంగా నిర్మాతకు జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం అసంతృప్తి అనిపించినప్పటికీ అతను ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా బాగా కలిసొచ్చింది. ఎందుకంటే అప్పుడప్పుడే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎక్కువగా పెంచుకుంటున్న ఎన్టీఆర్ నుంచి ఆడియెన్స్ బొమ్మరిల్లు లాంటి సినిమాను ఏ మాత్రం రిసీవ్ చేసుకోరు. తప్పకుండా ప్లాప్ అయ్యి ఉండేదని కామెంట్స్ వచ్చాయి.

పెట్టుబడికి పదింతల లాభం..
ఒకవేళ చేసినా కూడా ఆ రేంజ్ లో హిట్టయ్యి ఉండేది కాదేమో. ఆ విషయాన్ని తారక్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. సింపుల్ గా లవర్ బాయ్ సిద్దార్థ్ తో చేయడమే కరెక్ట్ అని దిల్ రాజుకు మొదట ఐడియా ఇచ్చింది కూడా ఎన్టీఆరే. 2006లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో దిల్ రాజును ఒక విధంగా కుబేరుడిగా మార్చిందనే చెప్పాలి. పెట్టిన పెట్టుబడికి పదింతల లాభాన్ని అందించింది ఆ సినిమా.


Click it and Unblock the Notifications











