»   »  జూ ఎన్టీఆర్ బావమరది ఇతడే... (రేర్ ఫోటో)

జూ ఎన్టీఆర్ బావమరది ఇతడే... (రేర్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి ఒక రేర్ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. తన సోదరుడు నితిన్ ఫోటోను ఆమె షేర్ చేసింది. అసలు ఇంత వరకు ఎన్టీఆర్ కు బావమరిది ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఇపుడు ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.

ఇపుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవూతు వైరల్ లా వ్యాపించింది. నితిన్ చూడటానికి స్మార్ట్ లుక్ తో ఉండటంతో సినిమాల్లోకి వస్తాడనే చర్చ కూడా సాగుతోంది. ఇంతకీ అతనికి ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో? తెలియదు కానీ ఒక వేళ వస్తే మాత్రం బావ ఎన్టీఆర్ సపోర్టు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

2011లో ఎన్టీఆర్‌-లక్ష్మీప్రణతిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇపుడు ఒక బాబు. తన ముద్దుల కుమారుడికి అభయ్ రామ్ అనే పేరు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Jr NTR's Brother-In-Law's pic

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే....ఆయన నటించిన ‘నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానకి రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ‘జనతా గ్యారేజ్' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫిబ్రవరి 17న ఎన్టీఆర్ సెట్స్ లో జాయినవుతాడని అంటున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దర్శకుడు పక్కా ప్రణాళిక సిద్ధం చేసాడని, ఈ మేరకు అంతా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.

ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ.

English summary
Here is an amusing picture of NTR's wife Lakshmi Pranathi posing with the smart looking Nithin, her doting brother and brother-in-law of Young Tiger NTR. This rare family picture of Pranathi has been posted by a fan group on Facebook and is being shared among NTR's fans ever since.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu