»   » అతి భయంకరంగా ఎన్టీఆర్ గెటప్..జై లవకుశ ఫొటో లీక్!

అతి భయంకరంగా ఎన్టీఆర్ గెటప్..జై లవకుశ ఫొటో లీక్!

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం జై లవకుశ. ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఓ భయంకరమైన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది.

  ప్రత్యేకంగా హలీవుడ్ నుంచి మేకప్ మెన్

  ప్రత్యేకంగా హలీవుడ్ నుంచి మేకప్ మెన్

  ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. జై లవకుశ అని ప్రచారవవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి తారక్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాత. ఈ చిత్రానికి ఇద్దరు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. విలన్ ఛాయలున్న ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా హలీవుడ్ నుంచి మేకప్ మెన్ రప్పించిన సంగతి తెలిసిందే.

  లీకైన పోటో నిజమైనదా?

  లీకైన పోటో నిజమైనదా?

  ప్రతినాయకుడి పాత్రకు సంబంధించినట్లు భావిస్తున్న ఫోటోలో ఎన్టీఆర్ గెటప్ అతి క్రూరంగా ఉన్నది. లీకైన పోటో నిజమైనదా లేదా ఎన్టీఆర్ ఫోటోను మార్పింగ్ చేసి ఎవరైనా ఇంటర్నెట్ ‌లో పెట్టారా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారికంగా ఈ ఫొటోపై చిత్ర యూనిట్ ఏమైన వివరణ ఇస్తే తప్ప దీనిపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయే అవకాశం లేదు.

  షూటింగ్‌లో హరికృష్ణ

  షూటింగ్‌లో హరికృష్ణ

  దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల మరె ఫోటో బయటకు వచ్చింది. ఈ చిత్ర షూటింగ్‌లో తండ్రి హరికృష్ణతో ఎన్టీఆర్ మాట్లాడుతుండగా తీసిన ఫొటో అది. ఎన్టీఆర్ ముందు ఉన్న ఎన్ లవకుమార్ అనే నేమ్ ప్లేట్ స్పష్టంగా కనిపిస్తున్నది.

  ట్రిపుల్ రోల్..

  ట్రిపుల్ రోల్..

  ఈ చిత్రంలో ఆచారీ, పోలీసు అధికారి, ఓ విలన్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలను బట్టి పోలీస్ అధికారి పాత్ర పేరు ఎన్ లవ కుమార్ అనే విషయం స్పష్టమవుతున్నది. విలన్ ఛాయలున్న పాత్ర కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి మేకప్ మెన్‌ను రప్పించారు.

  అద్భుతమైన కథ.. 100 కోట్ల బడ్జెట్

  అద్భుతమైన కథ.. 100 కోట్ల బడ్జెట్

  ఈ చిత్ర విశేషాలు కల్యాణ్ రామ్ తెలియచేస్తూ .. బాబీ అద్భుతమైన కథను రూపొందించారు. ఎన్టీఆర్‌లో ఉన్న నటుడికి, కథకు న్యాయం చేకూర్చడానికి ఖర్చుకు వెనుకాడటం లేదు అని అన్నారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నట్టు సమాచారం.

  English summary
  NTR will be seen in three different characters or getups in his current film that is tentatively titled 'Jai Lava Kusa'. One of the roles named is N Lava Kumar. The team of the movie released a pic of Harikrishna visiting the movie sets and in the process a partial getup of NTR's Lava Kumar is also revealed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more