»   » డాన్స్ లకీ అంత రిస్క్ అవసరమా..? జనతా గ్యారేజ్ లీక్డ్ వీడియో లో తారక్ స్టెప్స్

డాన్స్ లకీ అంత రిస్క్ అవసరమా..? జనతా గ్యారేజ్ లీక్డ్ వీడియో లో తారక్ స్టెప్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఎన్టీఆర్ డాన్స్ కి ప్రత్యేకత ఉంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న సమయలో కూడా ఎలా అంటే అలా వొంటిని బెండ్ చేయగలిగే జూనియర్ ఇప్పుడు ఇంకా చెలరేగిపోతున్నాడు. మామూలుగు యాక్షన్ సన్ని వెశాలలోనే రిస్క్ ఫేస్ చేస్తారు హీరోలు కాని తారక్ మాత్రం డాన్స్ లో కూడా కాస్త ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తున్నాడు....

ప్రస్తుతం ఆయన కొత్త సినిమా జనతా గ్యారేజ్ లో కూడా డాన్స్ తో ఆదరగోట్టేసాడు అని చెప్పాలి, ఆయన సెట్స్ లో డాన్స్ వేస్తున్న వీడియో ఒకటి బయటకి లీక్ అయ్యింది ఆ వీడియో లో ఎన్టీఆర్ చాలా రిస్కీ స్టెప్ ఒకటి వేసాడు. ఒక పిట్ట గోడ మీద ఎక్కి దిగి, పరిగెడుతూ వేసే డాన్స్ ని చూస్తే చాలా కంగారు వేస్తుంది కూడా.

https://www.youtube.com/watch?v=T2QE6m9tu7o

మామూలుగా ఫైట్ లలో రిస్క్ ఉంటుంది కానీ ఎన్టీఆర్ డాన్స్ లలో కూడా రిస్క్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అతను చేసిన రిస్కీ డాన్స్ వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ట్విట్టర్ లో ఒక ఎన్టీఆర్ లేడీ వీరాభిమాని పెట్టిన వీడియో అందరికీ పాకేసింది. ఆమె ఆ వీడియో పెట్టిన కొన్ని గంటల పాటు ఆ స్టెప్ గురించి , లీకేజీ గురించి డిస్కషన్ సాగింది.

Jr NTR’s Leaked Video Song From Janatha Garage Movie

ఎక్కడ చూసినా ఆ వీడియోనే - యూత్ లో ఎవరు చూసినా ఎన్టీఆర్ డ్యాన్స్ గురించే మాట్లాడుకొంటున్నారు. ఇక మునుపటిలా డ్యాన్స్ వేయలేనేమో అంటూనే ఎప్పటికప్పుడు అదిరిపోయేలా స్టెప్పులేస్తుంటాడు తారక్. ఒక రెండు గంటల తారవాత మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆ లీక్ వీడియో ని తొలగించారు కూడా.

ఏదేమైనా జనతా గ్యారేజ్ సినిమాలో ప్రేక్షకుల్నీ , అభిమానుల్నీ ఉత్సాహపరిచే స్టెప్స్ తో ఎన్టీఆర్ సిద్దం అవుతున్నాడు అని అర్ధం అవుతోంది . ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన సమంత , నిత్య మీనన్ హీరోయిన్ లుగా చేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్దం అవుతోంది. ఆగస్ట్ 12 అని నిర్మాతలు విడుదల తేదీ కూడా ప్రకటించేసిన తరుణం లో ఈ సినిమా విడుదల కోసం టీం మొత్తం గట్టి కసరత్తు చేస్తోంది.

English summary
A video of Tarak reharsing for a song has been leaked and is going viral online. The video showcases Tarak dancing in Mumbai which has been trending all over. The audio of Janatha Garage will be unveiled on July 22nd in Hyderabad and Mythri Movie Makers are producing the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu