»   » జై లవకుశ‌లో ఎన్టీఆర్ గెటప్ లీక్.. హరికృష్ణ గెస్ట్ రోల్!

జై లవకుశ‌లో ఎన్టీఆర్ గెటప్ లీక్.. హరికృష్ణ గెస్ట్ రోల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి తారక్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాత. ఈ చిత్రానికి ఇద్దరు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ చిత్రానికి భారీ స్పందన వచ్చింది. ఇంటర్నెట్‌లో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

షూటింగ్‌లో హరికృష్ణ

షూటింగ్‌లో హరికృష్ణ

దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి జై లవకుశ పేరు ప్రచారంలో ఉన్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించే పాత్రల పేరు జై, లవ, కుశ. ఈ పేర్లను ధ్రువీకరించే విధంగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ చిత్ర షూటింగ్‌లో తండ్రి హరికృష్ణతో ఎన్టీఆర్ మాట్లాడుతున్న ఫొటో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ముందు ఉన్న ఎన్ లవకుమార్ అనే నేమ్ ప్లేట్ స్పష్టంగా కనిపిస్తున్నది.

రామోజీ ఫిలిం సిటీలో .

రామోజీ ఫిలిం సిటీలో .

ఈ చిత్ర కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ సెట్‌ను హరికృష్ణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సెట్ ప్రాధాన్యతను, కథను, షూటింగ్ విశేషాలను చిత్ర యూనిట్ హరికృష్ణకు వివరించినట్టు సమాచారం.

ట్రిపుల్ రోల్..

ట్రిపుల్ రోల్..

ఈ చిత్రంలో ఆచారీ, పోలీసు అధికారి, ఓ విలన్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలను బట్టి పోలీస్ అధికారి పాత్ర పేరు ఎన్ లవ కుమార్ అనే విషయం స్పష్టమవుతున్నది. విలన్ ఛాయలున్న పాత్ర కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి మేకప్ మెన్‌ను రప్పించారు.

అద్భుతమైన కథ.. 100 కోట్ల బడ్జెట్

అద్భుతమైన కథ.. 100 కోట్ల బడ్జెట్

ఈ చిత్ర విశేషాలు కల్యాణ్ రామ్ తెలియచేస్తూ .. బాబీ అద్భుతమైన కథను రూపొందించారు. ఎన్టీఆర్‌లో ఉన్న నటుడికి, కథకు న్యాయం చేకూర్చడానికి ఖర్చుకు వెనుకాడటం లేదు అని అన్నారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నట్టు సమాచారం.

రాశీఖాన్నాతో సయ్యాట..

రాశీఖాన్నాతో సయ్యాట..

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖాన్నా హీరోయిన్. మరో హీరోయిన్ కోసం నివేదా థామస్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్, తండ్రి హరికృష్ణ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం.

English summary
NTR will be seen in three different characters or getups in his current film that is tentatively titled 'Jai Lava Kusa'. One of the roles named is N Lava Kumar. The team of the movie released a pic of Harikrishna visiting the movie sets and in the process a partial getup of NTR's Lava Kumar is also revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu