»   »  ఎన్టీఆర్ కొత్త పార్టీ పేరు "సమసమాజ్ పార్టీ", ఎన్నికల ప్రచారం లో తారక్: అసలు మ్యాటర్ ఇదీ

ఎన్టీఆర్ కొత్త పార్టీ పేరు "సమసమాజ్ పార్టీ", ఎన్నికల ప్రచారం లో తారక్: అసలు మ్యాటర్ ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి తారక రామారావు ఈ పేరు అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు తెలుగు రాజకీయాల్లోనూ ఎప్పటికీ ఒక చరిత్రగా నిలబడే పేరు. తెలుగు రాజకీయాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నదో కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఆయనకి రాజకీయ వారసత్వానికీ కొరత లేదు. ఆ ఒక్క పేరుతోనే ఈ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికీ ముడి పడి ఉన్నాయన్న సంగతి చెప్పాల్సిన పనేమీ లేదు కదా... అయితే ఇప్పుడు కొత్త గా నెట్ లో కనిపిస్తున్న ఫొటోలు కలకలం రేపాయి.... ఆనాటి ఎన్టీఆర్ పోలికలతోనే ఆయన నటవారసుడు అనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు దేశం పార్టీ తరఫున ప్రచారం చేసినప్పుడు వచ్చిన స్పందన కూడా ఇప్పటికీ మర్చిపోలేదెవ్వరూ....

సమసమాజ్ పార్టీ

సమసమాజ్ పార్టీ

ఆ తర్వాత అడపాదడపా తారక్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అన్న అనుమానం వినిపించినా ఎటూ చెప్పకుండా సినిమాలకే తన ఓటు అన్నట్టు గా ఉండి పోయాడు తారక్. అయితే ఈ చిన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెడితే చూడాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి అభిమానుల కోరిక త్వరలోనే తీరనుంది... జూనియర్ కొత్త పార్టీ పెట్టేసాడు దాని పేరు సమసమాజ్ పార్టీ అంటూ పేరుకూడా పెట్టేసారు....

Ram Gopal Varma to make Sr. NTR biopic
జై లవకుశ

జై లవకుశ

ఈ రోజు ఉదయం నుంచీ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం లో ఉన్నట్టు, పార్టీ జండాలతో ఉన్న ఫ్లెక్సీలు సోష‌ల్ మీడియా చ‌క్క‌ర్లు కొడుతూండటం తో ఆ ఫొటోలు చూసి షాక్ తిన్నారు. అయితే ఆ ఫొటోల కింద ఉన్న మ్యాటర్ చూసాక అది మనోడి కొత్త సినిమా జై లవకుశ సినిమాలో ఉండే పాత్ర కోసం అని అర్థమయ్యి కొందరు ఆనంద పడితే కొందరు నిరాశపడ్డారు.

బిగ్‌ బాస్

బిగ్‌ బాస్

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. 'బిగ్‌ బాస్'షోతో బుల్లితెర మీద హల్‌చల్‌ చేస్తున్నారు. మరోవైపు ‘జై లవకుశ' సినిమా పనులతో కూడా బిజీగా ఉన్నాడు. బాబి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీయార్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీయార్‌ పోషిస్తున్న ‘జై' క్యారెక్టర్‌ గురించిన టీజర్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.

పూణేలోని బోర్ న‌గ‌రంలో షూటింగ్

పూణేలోని బోర్ న‌గ‌రంలో షూటింగ్

ప్ర‌స్తుతం ఈ చిత్రం పూణేలోని బోర్ న‌గ‌రంలో షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా స‌మ‌స‌మాజ్ పార్టీ అధినేత పాత్ర చేస్తున్న‌ ఎన్టీఆర్ పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ‘సమసమాజ్‌' పార్టీ జెండాలు, వాటి మీద ఎన్టీయార్‌ బొమ్మలు ఉన్న ఫోటోలు వర్కింగ్‌ స్టిల్స్‌గా బయటకు వచ్చాయి.

సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల

సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల

అయితే ఆ జెండాలపై పేరు ఇంగ్లీష్‌, హిందీ బాషల్లో ఉండడంతో.. ఎన్టీయార్‌ ఉత్తరాదికి చెందిన రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ పిక్స్ లో ఎన్టీఆర్ చాలా మెచ్యూర్డ్ గా, గంభీరంగా కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలు జై పాత్ర‌కి సంబంధించిన‌వి అని తెలుస్తుంది. సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానున్న ఈ మూవీ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు

English summary
The latest viral photo that is doing rounds on Social media platform is related to new political party called ‘Sama Samaj Party’. The banner of Sama Samaj Party features Jr.NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu