Just In
- 26 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'టెంపర్' ఆడియో లాంచ్ హైలెట్స్ ( ఫొటోలు)
హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా నటించిన'టెంపర్'. ఈ సినిమా పాటల వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఎన్టీఆర్ సరసన కాజల్ నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విచ్చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఎన్టీఆర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ... ''మా సినిమా బాగుంటుంది, అదరగొట్టింది, ఇరగొట్టింది... అని ప్రతి సినిమా పాటల వేడుకలో చెప్తూనే ఉన్నాను. నిజాయతిగా చెప్పాలంటే గత రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని నిరాశపరిచాను. నేను హిట్, ప్లాఫ్ అనేవీ నాకొద్దు. మీకు నచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటా'' అన్నారు.
స్లైడ్ షోలో ఆడియో విడుదల ఫొటోలు

ఆవిష్కరణ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ తొలి సీడీని ఆవిష్కరించారు.

అందుకున్నారు
వినాయిక్ చేతుల మీదుగా ఆవిష్కరణ అయ్యిన సీడిని ...హీరో నందమూరి కల్యాణ్‌రామ్ అందుకున్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ....
భార్య, బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకోవాలో అభిమానులనూ అంతే ప్రేమగా చూసుకోవాలి. నేనిప్పుడు రెండు కాళ్లపై ఇలా ఇక్కడ నిలబడ్డానంటే అంతా మీ వళ్లే. తాతగారు, అభిమానులు ఆశీస్సులు లేకుంటే నాకీ బతుకు లేదు అన్నారు

కాలరెత్తుకు తిరగాలనేదే
ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ... నందమూరి అభిమాని కాలర్ ఎత్తుకుని తిరగాలనేదే నా కోరిక. అన్నయ్య కల్యాణ్‌రామ్ జనవరిలో 'పటాస్'తో మొదలెట్టాడు. ఇప్పుడు 'టెంపర్' వస్తోంది. నేనిప్పటి వరకు అన్ని సినిమాలు కష్టపడి చేశా. ఈ సినిమా మాత్రం కసితో చేశా. ఈ సినిమా మీకు నచ్చకపోయినా ఫర్వాలేదు. ఇంకోటి తీస్తా. అదీ నచ్చకపోతే ఇంకోటి తీస్తా. అలా తీస్తూనే ఉంటా అన్నారు.

రాసిపెట్టుకోండి
'టెంపర్' తర్వాత బాబాయ్ బాలకృష్ణ 'లయన్'గా వస్తున్నారు. రాసిపెట్టుకొండి ఇది నందమూరి నామ సంవత్సరం. ఇది జరిగి తీరుతుంది అన్నారు.

ఆశీస్సులు ఉంటాయి.
తాతయ్య నందమూరి తారకరామారావుగారి ఆశీస్సులు మనందరి మీదా ఉంటాయంటూ ఎమోషనల్ గా చెప్పారు ఎన్టీఆర్

స్టైల్ మారలేదు
11 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్‌తో మళ్లీ సినిమా చేస్తున్నా. అప్పటికీ ఇప్పటికీ ఆయన వర్కింగ్ స్త్టెల్ ఏమీ మారలేదు. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం మారుతుంది''అన్నారు ఎన్టీఆర్.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...
2004లో ఎన్టీఆర్‌తో 'ఆంధ్రావాలా' తీశాను. ఆ సినిమా చూసి ఫ్యాన్స్ తిట్టుకున్నారు. చాలా నిరాశపరిచిన సినిమా అది. ఇప్పుడు 'టెంపర్' తీశాను. నన్ను నమ్మండి ఈ 11 ఏళ్లలో ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నింటినీ మరచిపోతారు. ఇదొక్కటే గుర్తుపెట్టుకుంటారు అన్నారు.

అంకిత భావంతో..
పూరి కంటిన్యూ చేస్తూ... ఎన్టీఆర్‌ను కొత్త అవతారంలో చూపించిన సినిమా ఇది. సిక్స్ ప్యాక్‌లో కనిపించే ఓ సీన్ కోసం ఎన్టీఆర్ 18 గంటలపాటు నీళ్లు కూడా తాగలేదు. అంతటి అంకితభావంతో పని చేశాడు.

ప్రభావం ఉండిపోతుంది
నందమూరి వంశం నుంచి నేను లాంచ్ చేస్తున్న మరో కొత్త హీరో ఈ ఎన్టీఆర్. 'టెంపర్' తర్వాత చాలా సినిమా వస్తాయి. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాతో చూపించిన ప్రభావం చాలా కాలం ఉండిపోతుంది''అని పూరి జగన్నాథ్ అన్నారు.

కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ...
''ఈ ఏడాది నందమూరినామ సంవత్సరం. పటాస్, టెంపర్, లయన్ ఈ మూడు సినిమాల పేర్లు మూడక్షరాలే. ఆ సెంటిమెంట్ కలిసొస్తుంది. అభిమానుల కోసం తమ్ముడు మనసు, ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది''అన్నారు.

వినాయక్ మాట్లాడుతూ...
''ఎన్టీఆర్ చాలా మొండోడు. తనకుతాను అనుకుంటే తప్పా ఏదీ చేయడు. అలాంటిది ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఆ ఎన్టీఆర్‌యేనా అనిపిస్తోంది. జగన్ సంభాషణలు బాగున్నాయ''అన్నారు.

కాజల్ మాట్లాడుతూ...
''ఎన్టీఆర్‌తో ఇది నా మూడో సినిమా. ఈ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అంతేకాదు చాలా హట్‌గా ఉంటాడు'' అంది.

బండ్ల గణేష్ మాట్లాడుతూ...
''బాద్‌షా' చేస్తున్నపుడే నీతో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడిలా 'టెంపర్' ఇచ్చాడు. ఈ సినిమా మీద నమ్మకంతో సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు.

ఇది ఒక ఎత్తు...
బండ్ల గణేష్ కంటిన్యూ చేస్తూ.. నందమూరి అభిమానులు కాలర్ ఎత్తుకొని గర్వపడే సినిమా అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ 'టెంపర్' ఒకెత్తు. సినిమాను వచ్చే నెల 13న విడుదల చేస్తాము''అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..
పూరి-ఎన్టీఆర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ సినిమా అన్నారు అనూప్ రూబెన్స్.

సుకుమార్ మాట్లాడుతూ ..
''ఈ సినిమా మీ అందరికంటే ముందు నేనే చూశా. 'దయా'ను కౌగలించుకోవాలనిపించింది. పూరి ఒక వారం కూర్చొని కథ రాస్తే సినిమా హిట్ అంటారు. ఈ సినిమా కథను వక్కంతం వంశీతో కలసి నాలుగు వారాలు రాశాడు. అందుకే ఘన విజయం సాధిస్తుంది''అన్నారు.

ఈ కార్యక్రమంలో...
శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, కె.ఎస్.రామారావు, జెమిని కిరణ్, ప్రసాద్ వి.పొట్లూరి, ఛార్మి, భాస్కరభట్ల, విశ్వ, వక్కంతం వంశీ, రంజిత్ రెడ్డి, డి.జయంత్, సుబ్బారెడ్డి, నరేంద్ర చౌదరి, కందికొండ, అంబికా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

తెర ముందు
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తెర వెనుక
ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.