»   » ఆశ్చర్యం: జూ ఎన్టీఆర్ భార్య ఏ హీరో ఫ్యానో తెలుసా?

ఆశ్చర్యం: జూ ఎన్టీఆర్ భార్య ఏ హీరో ఫ్యానో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తెలుగులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు. అయితే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి మాత్రం.....హీరో నానికి పెద్ద ఫ్యాన్. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు జూ ఎన్టీఆరే. 'పిల్ల జమీందార్' చిత్రంలో నాని నటన ఆమెకు చాలా నచ్చింది. ఆ చిత్రాన్ని నాతో కలసి ప్రణతి ఎన్నో సార్లు చూసిందో లెక్కించడం చాలా కష్టం' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఇటీవల ‘టెంపర్' సినిమా విజయం సాధించడంతో ఎన్టీఆర్‌తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి కూడా చాలా సంతోషంగా ఉందట. ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్‌లో కాన్పిడెన్స్ రెట్టింపయింది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు మరో సినిమా మొదలెడుతున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.

Jr NTR's Wife is a Big Fan of Nani

ఈ చిత్రానికి దండయాత్ర అనే టైటిల్ ని పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇది దండయాత్ర...దయాగాడి దండయాత్ర అనేది పాపులర్ కావటంతో దండయాత్ర అనేదే ఫిక్స్ చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఎన్టీఆర్‌ తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌ తరహాలో వైవిధ్యంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ గెటప్‌ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. మార్చి 5న చిత్రం ప్లోర్ మీదకు వెళ్ళనుంది. అలాగే...జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. స

English summary
Young tiger Jr NTR's wife Lakshmi Pranathi is a big fan of another Tollywood hero Nani, this has been informed by NTR itself.
Please Wait while comments are loading...