»   »  ఎందరో మహానుభావులు అంటూ జూ ఎన్టీఆర్ సెల్యూట్ సెల్ఫీ!

ఎందరో మహానుభావులు అంటూ జూ ఎన్టీఆర్ సెల్యూట్ సెల్ఫీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వాంతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన సోషల్ నెట్వర్కింగ్ ట్విట్టర్ పేజీ ద్వారా సెల్యూట్ సెల్పీ పోస్టు చేసాడు. ఎందరో మహానుభావులు...అందరికీ వందనాలు, జై హింద్! అంటూ జూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.


జూ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా విషయానికొస్తే...
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం ( 'నాన్నకు ప్రేమతో' వర్కింగ్ టైటిల్) చేస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న సాయంత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.
Jr NTR salute selfie

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
"Endaro mahanu bhavulu..andariki vandanalu..JAI HIND" Jr NTR tweet about Independence day.
Please Wait while comments are loading...