»   » బాబాయ్ ని చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు....జూ ఎన్టీఆర్

బాబాయ్ ని చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు....జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పరమవీర చక్ర' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూసే అవకాశం నాకు దక్కింది. నిజంగా రెండు కళ్లు చాల్లేదు. బాబాయ్‌ అద్భుతంగా నటించారంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'పరమవీర చక్ర' ఆడియో బుధవారం రాత్రి హైదరాబాద్ ‌లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ అందుకొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు కె.బాలచందర్‌ తోపాటు రామ్‌ నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో అమీషా పటేల్‌, నేహా ధూపియా, షీలా కథానాయికలు. సి.కల్యాణ్‌ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, వినాయక్‌, కల్యాణ్ ‌రామ్‌, తారకరత్న, షీలా, బోయపాటి శ్రీను, బి.గోపాల్‌, కేఎస్‌ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu