»   » క్యూ లో నిలబడి ఎన్టీఆర్ ఓటు వేస్తూ... (ఫొటో)

క్యూ లో నిలబడి ఎన్టీఆర్ ఓటు వేస్తూ... (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రముఖ సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన అలా క్యూలో నిలబడి ఓటేయటం చాలా మంది అభిమానులకు స్పూర్తిని ఇచ్చినట్లైంది.

మరో ప్రక్క కేంద్రమంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారు. భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్‌, కుమార్తెతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని కొద్దిసేపు క్యూలో నిల్చున్నారు. కొద్దిసేపటి తర్వాత అధికారులు నేరుగా వచ్చి ఓటు వేయాలని చిరంజీవికి సూచించారు. చిరంజీవి కుటుంబ సభ్యులు ఓటు వేసేందుకు ముందుకు రావడంతో క్యూలో నిల్చున్న ఓటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో చిరంజీవి మళ్లీ క్యూలో నిల్చుని వరుస క్రమంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Jr NTR stands in queue to VOTE!

ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ జూబ్లీహిల్స్‌ గాయత్రీనగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

English summary
Jr NTR who appeared at the polling booth on Wednesday at around 7 am in the morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu