»   » ఫ్రాన్స్ లో జూ ఎన్టీర్, తమన్నా రొమాన్స్...!

ఫ్రాన్స్ లో జూ ఎన్టీర్, తమన్నా రొమాన్స్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ కథానాయకుడుగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న 'ఊసరవెల్లి' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. విజయదశమికి విడుదల చేసే ప్లానింగ్ తో ఓ పక్క షూటింగ్ జరుగుతుంటే... మరోపక్క ఎడిటింగ్, డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాదులోని వివిధ లోకేషన్లలో దీని షూటింగ్ జరిపారు.

కాగా, ఈరోజు హీరో హీరోయిన్లు జూ ఎన్టీఆర్, తమన్నా పాటల చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ బయలుదేరి వెళ్లారు. అక్కడి పలు నగరాలలో వీరిద్దరి పైనా రెండు పాటలను చిత్రీకరిస్తారు. ఆమధ్య రిలీజ్ అయిన తన సినిమా 'శక్తి' ఫ్లాప్ అవడంతో ఈ సినిమాను ఎలాగైనా సరే హిట్ చేయాలన్న పట్టుదలతో జూ ఎన్టీఆర్ ఉన్నాడని సమాచారం. శ్రీవెంటేశ్వర బ్యానర్ సినీ చిత్ర బ్యానర్ లో బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మాణంలో నిర్మితమైవుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్న విషయం విధితమే...

English summary
'Oosaravelli' movie starring Jr.Ntr and Tamanna is Flying to France for a brief schedule in which the unit will cane couple of songs. The film is in its last phase of shoot and the movie is expected to release on October 6th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu