For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్: కరోనాకు మందు అదే.. వాళ్ల పేర్లు చెప్పి మరీ థ్యాంక్స్ అంటూ ట్వీట్

  |

  మొదటి దశతో పోలిస్తే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై విపరీతంగా చూపిస్తోంది. దీంతో ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అదే సమయంలో ప్రాణాలను సైతం కోల్పోతోన్నారు. ఇక, ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమపై కోవిడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. తద్వారా చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సినీ కార్మికులు పాజిటివ్‌గా తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం కోవిడ్ బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ఓ శుభవార్తను చెప్పాడు. ఆ వివరాలు మీకోసం!

  టాలీవుడ్ స్టార్ హీరోలకు కరోనా పాజిటివ్

  టాలీవుడ్ స్టార్ హీరోలకు కరోనా పాజిటివ్

  ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు చిన్న చిన్న ఆర్టిస్టులతో పాటు స్టార్ హీరోలు సైతం కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. మొదటి దశంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వంటి వాళ్లు కోవిడ్‌తో పోరాడి విజయం సాధించారు. ఇక, సెకెండ్ వేవ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఈ మహమ్మారితో పోరాటం చేసి కోలుకున్నారు.

  జూనియర్ ఎన్టీఆర్ కూడా లిస్టులో చేరాడు

  జూనియర్ ఎన్టీఆర్ కూడా లిస్టులో చేరాడు

  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే మే 10వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ కూడా పాజిటివ్‌గా తేలాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను బాగానే ఉన్నాను.. దయచేసి మీరెవరూ బాధ పడకండి. నాతో కుటుంబ సభ్యులు కూడా ఎవరికి వారే ఐసోలేషన్‌లో ఉన్నాం' అని తెలిపాడు.

  పుట్టినరోజు సమయంలో ఫ్యాన్స్ నిరాశగా

  పుట్టినరోజు సమయంలో ఫ్యాన్స్ నిరాశగా

  జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న. ఇందుకోసం అతడి అభిమానులు ఎప్పటి నుంచో ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. వాస్తవానికి నెల రోజుల ముందే ట్రెండ్‌ను క్రియేట్ చేసిన వాళ్లంతా.. పుట్టినరోజున సోషల్ మీడియాలో రచ్చ చేయాలని సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తారక్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ నిరాశగా ఉండిపోయారు.

  ఇంట్లోనే చికిత్స... ట్వీట్ చేసిన చిరంజీవి

  ఇంట్లోనే చికిత్స... ట్వీట్ చేసిన చిరంజీవి

  కరోనా సోకిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ఆరోగ్యం గురించి తరచూ అప్‌డేట్లు ఇస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా అతడి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశాడాయన. అందులో ‘తారక్‌తో మాట్లాడాను. అతడితో పాటు కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందకండి' అంటూ వెల్లడించారు.

  ఎన్టీఆర్‌కు కరోనా నెగెటివ్.. ట్వీట్ చేశాడు

  ఎన్టీఆర్‌కు కరోనా నెగెటివ్.. ట్వీట్ చేశాడు

  పుట్టినరోజు సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకుంటున్నానని, రెండు మూడు రోజుల్లో నెగెటివ్ రావొచ్చని తెలిపాడు. అందుకు అనుగుణంగానే తాజాగా తారక్ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఈ నందమూరి హీరోకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దీనిని స్వయంగా ప్రకటించాడతను.

  వాళ్లకు ధన్యవాదాలు తెలిపిన స్టార్ హీరో

  వాళ్లకు ధన్యవాదాలు తెలిపిన స్టార్ హీరో

  తనకు కరోనా నెగెటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు ఎన్టీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘ఈ విషయాన్ని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ సందర్భంగా నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే నాకు చికిత్స చేసిన డాక్టర్లకు, లాబ్‌కు సైతం థ్యాంక్స్' అంటూ అందులో పేర్కొన్నాడు.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
  కరోనాకు మందు అదేనంటూ చెప్పాడు

  కరోనాకు మందు అదేనంటూ చెప్పాడు

  కరోనా వైరస్‌పై ఎలా పోరాడాలో చెబుతూ.. ‘కోవిడ్ 19ను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, సానుకూల ధృక్పథంలో పాటు సులువైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. మరీ ముఖ్యంగా కరోనాతో చేసే పోరాటంలో మీ సంకల్పమే అతిపెద్ద ఆయుధం అని గుర్తించాలి. ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి' అంటూ చెప్పాడు తారక్.

  English summary
  Few Days Back Jr NTR tested Positive for Covid19. Now He tested Negative Says This Star Hero in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X