»   »  ఆ నలుగురితో "కంత్రి"

ఆ నలుగురితో "కంత్రి"

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న "కంత్రి" సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నలుగురు ప్రతినాయకులతో పోరాడబోతున్నాడు. వాళ్ళు అతిధి ఫేమ్ మురళీ శర్మ, షాయీజీ షిండే, ప్రకాష్ రాజ్, ఆషిష్ విధ్యార్ధి. సాధారణంగా విలన్ ఎంత పవర్ ఫుల్ అయితే హీరో అంతగా ఎలివేట్ అవుతాడన్నది సార్వజనీనమైన సినిమా రూలు. దాన్ని మనవాళ్లు మరింత ముందుకు వెళ్లి తెరనిండా విలన్లు తాండవం చేసే రేంజికి తీసుకెళ్లారు. ఎంత ఎక్కవ మంది ఉంటే అంతగా కథలో కాంఫ్లిక్ట్ పెరిగుతుంది. దాంతో యాక్షన్ కి స్కోప్ పెరిగి ఎమోషన్లు బాగా పండుతుంటాయి. అది చాలా సార్లు పెద్ద హీరోల సినిమాల్లో వర్కవుట్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు మెహర్ రమేష్ అదే సేఫ్ గేమ్ ఆడబోతున్నాడు. అందులోనూ జూ. ఎన్టీఆర్ భావోద్వేగాలు పండించగలగటం, దర్శకుడు మెహర్ రమేష్ గతంలో చేసిన కన్నడ సినిమాలు యాక్షన్ బేస్డ్ కావటం దీనికి మరింత ప్లస్ అవుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X