»   » ‌అద్గదీ: బాబాయ్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై అబ్బాయి ఎన్టీఆర్‌ కామెంట్ ఇదీ‌!

‌అద్గదీ: బాబాయ్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై అబ్బాయి ఎన్టీఆర్‌ కామెంట్ ఇదీ‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి.


ఇక ఆ అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సినిమా సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాతకర్ణి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ సెలబ్రెటీలు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఈ చిత్రం చూసి తన అభిప్రాయం తెలిపారు.


''ఇప్పుడే చిత్రాన్ని చూశాను. సాహో నందమూరి బాలకృష్ణ. సాహో డైరెక్టర్‌ క్రిష్‌. సాహో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర బృందం. ఇది ఒక తెలుగువాడి విజయం. తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం. చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం' అని ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం ఎన్టీఆర్‌ బాబి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జై.. లవ.. కుశ..' అనే పేరు పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.


Jr NTR Tweet on Gautamiputra Satakarni movie

ఇక ఈ స్థాయి సక్సెస్‌ను అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ బాలకృష్ణ, ఈ సంక్రాంతికి తనకు గొప్ప విజయం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు.
తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరైన శాతకర్ణి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క తెలుగు వారికే కాక, దేశం మొత్తం గర్వించదగ్గ సినిమా అని బాలకృష్ణ అన్నారు.


తమ సినిమాకు ట్యాక్స్ మినహాయింపునిచ్చి అండగా నిలిచినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాలయ్య ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.


English summary
Jr NTR Tweet on Gautamiputra Satakarni movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu