»   »  ఖరారు ‌: ఎన్టీఆర్‌ చేతుల మీదుగా టీజర్‌ రిలీజ్

ఖరారు ‌: ఎన్టీఆర్‌ చేతుల మీదుగా టీజర్‌ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'కుమారి 21 ఎఫ్‌'. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యప్రతాప్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

 

ntr

ఇటీవల హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేసారు. అయితే టీజర్‌ను జూనియర్‌ ఎన్టీఆర్‌చే విడుదల చేయించేందుకు సిద్ధం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం షూటింగ్‌ లండన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారంలోనే ఎన్టీఆర్‌తో లండన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ తెలియచేసింది.


ఇక ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే పేరును ఖరారు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌ స్త్టెలిష్‌గా కనిపిస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ''కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్‌ పాత్రలోనూ, ఆయన తెరపై కనిపించే విధానంలోనూ వందశాతం వైవిధ్యం చూస్తారు ప్రేక్షకులు. నేను, ఎన్టీఆర్‌ కలిసి తొలిసారి చేస్తున్న ఈ సినిమా మా ప్రయాణంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంద''న్నారు.

 

ntr

నిర్మాత మాట్లాడుతూ ''ప్రచార చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. విజయదశమికి టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. ఎన్టీఆర్‌, సుకుమార్‌ కలయికలో వస్తున్న ఈ చిత్రం మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఈ నెల 24 వరకు లండన్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

ఈ చిత్రం కథలో ఓ సర్పైజ్ ఉండబోతోందని సమాచారం.అది మరేదో కాదు ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ బయిటకు వచ్చింది ఎన్టీఆర్ ఒక పాత్ర గెటప్ అని, రెండో గెటప్ గోప్యంగా ఉంచాలని యూనిట్ నిర్ణయించుకుందని సమాచారం. గతంలోనూ ఎన్టీఆర్...అదుర్స్ చిత్రంలో డ్యూయిల్ రోల్స్ చేసారు. అది మంచి హిట్టైంది. అయితే ఈ డ్యూయిల్ రోల్ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ చక్రవర్తి

English summary
“Kumari 21 F” movie team planning to rope in Jr NTR to launch teaser of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu