twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిమ్మల్ని చూసేంత వరకైనా బతుకుతాను.. వీడియో కాల్‌లో అభిమాని మాటలకు ఎన్టీఆర్ ఎమోషనల్

    |

    తెలుగు చిత్రసీమలో హీరోలది, అభిమానులది ప్రత్యేక అనుబంధం. ఎవరి హీరోలు అభిమానులు వారికే ఉంటారు. ఫ్యాన్స్ మాటలను కాదని హీరోలు ఏ పని చేయని పరిస్థితి. సినిమాలు తీసినా సరే అది ఫ్యాన్స్ ఇష్టాన్ని, కోరికలను దృష్టిలో పెట్టుకునే తీస్తుంటారు. ఎందుకంటే హీరోలకు తమ అభిమానులే కొండంత బలం. ఇక అభిమానులకు అయితే తమ హీరోలే ఆరాధ్య దైవాలు. అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే హీరోలు కదిలివస్తారు. తాజాగా ఎన్టీఆర్ తన వీరాభిమాని కోసం కదిలి వచ్చాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

    అదొక్కటే చాలు..

    అదొక్కటే చాలు..

    ‘ఇది లైఫ్‌లో మరిచిపోలేని రోజు అన్నా.. మీతో ఇలా వీడియో కాల్‌లో మాట్లాడం మరిచిపోలేను అన్నా.. ఎన్నోసార్లు కలుసుకోవాలని అనుకున్నాను అన్నా.. నాకు మీతో ఒక్క సెల్ఫీ కావాలన్నా.. ఒక్కటే సెల్ఫీ ఇంకేమీ వద్దన్నా' అని ఎన్టీఆర్‌ను సదరు అభిమాని వేడుకున్నాడు. వీడియో కాల్‌లోనే ప్రార్థించాడు.

    త్వరలోనే కలుద్దాం..

    త్వరలోనే కలుద్దాం..

    అభిమాని అన్న మాటలకు చలించిన తారక్.. అన్నా అంటూ సదరు అభిమానిని సంబోధిస్తూ.. ఈ కరోనా ఈ పరిస్థితి అంతా కాస్త తగ్గిన తరువాత నిన్ను కలుస్తాను ఓ సెల్పీ ఏంటి మంచి ఫోటో దిగుదాం సరేనా అంటూ హామి ఇచ్చాడు. ఎన్టీఆర్ అన్న మాటలకు అభిమాని మొహంలో నవ్వులు పూశాయి. ఈ ఒక్క మాట చాలన్నా అంటూ తెగ సంబరపడిపోయాడు.

    ఇక్కడే ఉంటాం..

    ఇక్కడే ఉంటాం..

    అప్పటి వరకు నువ్ బాగా తిను ఆరోగ్యంగా ఉండు.. రెస్ట్ తీసుకో.. అని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడు. మిమ్మల్ని కలవాలన్నా ఆశతోనైనా బతుకుతాను అన్నా.. మిమ్మల్ని చూసేంత వరకైనా బతుకుతాను అని అభిమాని అన్న మాటలకు ఎన్టీఆర్ కదిలిపోయాడు. అయ్యో నువ్ ఎక్కడికి వెళ్తావ్ నేను ఎక్కడికి వెళ్తాను.. నీకు ఏమీ కాదు.. నాకు ఏమీ కాదు.. అందరం ఇక్కడే ఉంటాం కలుద్దాం అంటూ భరోసా ఇచ్చాడు.

    ధీనస్థితిపై ఆవేదన..

    ధీనస్థితిపై ఆవేదన..

    జాగ్రత్తగా ఉండు ఆరోగ్యం బాగా చూసుకో అక్కడే మనవాళ్లు ఉన్నారు.. బాగా చూసుకుంటారు.. నువ్ జాగ్రత్త అమ్మ వాళ్లను జాగ్రత్తగా చూసుకో అంటూ ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా మాట్లాడాదు. ఆ తరువాత అభిమాని అమ్మ మాట్లాడుతూ తన కొడుకు ధీనస్థితి గురించి ఎన్టీఆర్ ముందు విన్నవించుకుంది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించాం.. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయని తన గోడు వెల్లిబుచ్చుకుంది.

    సాయం చేస్తానని భరోసా

    అభిమాని తల్లి మాటలు విన్న ఎన్టీఆర్ ఆమెకు హామీ ఇచ్చాడు. నేనేం చేయగలనో అన్నీ చేస్తాను.. జాగ్రత్త చూసుకో అంటూ భరోసా ఇచ్చాడు. త్వరలోనే మనం కలుద్దామంటూ అభిమానికి మాటిచ్చాడు. హాయిగా ఉండు ఆనందంగా ఉండు అదే నీకు ఆయుష్షును పెంచుతుందని చెప్పాడు. థ్యాంక్స్ అన్నా కొమురం భీం అన్నా అంటూ అభిమాని అన్న మాటలకు ఎన్టీఆర్ చిరునవ్వులు చిందించాడు.

    English summary
    Jr NTR Video Call To Die hard Fan Venkanna, today interacted via video call with his die hard fan Venkanna who is severely affected and bed ridden with muscular dystrophy. #NTR promised to meet him and give him a selfie after things are back to normal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X