»   » హీరోయిన్ కారులో హీరో అర్థనగ్నంగా.. కెమెరాకు చిక్కిన వరుణ్.. వీడియో వైరల్

హీరోయిన్ కారులో హీరో అర్థనగ్నంగా.. కెమెరాకు చిక్కిన వరుణ్.. వీడియో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో వరుణ్ ధావన్ ఒకరు. తాజాగా ఆయన నటించే చిత్రం జుడ్వా2. ఈ చిత్రంలో వరుణ్ పక్కన తాప్సీ పొన్ను, జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వా చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్‌లో హీరో, హీరోయిన్లు బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోయిన్ జాక్వలైన్ కారులో వరుణ్‌ అర్థనగ్నంగా మీడియాకు చిక్కారు. కారులో అసలేం జరిగిందంటే..

  అంబానీ విందులో..

  అంబానీ విందులో..

  వారాంతంలో గాయని ఫాల్గుని పాథక్ నిర్వహించిన దాండియా నైట్‌కు వరుణ్ ధావన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హాజరయ్యారు. అక్కడ నుంచి అంబానీ నివాసం ఆంటీలా జరిగే విందులో నేరుగా పాల్గొనాల్సి వచ్చింది. దుస్తులు మార్చుకోవడానికి సమయం లేకపోవడంతో జాక్వలైన్ కారులోనే వరుణ్ ప్యాంటు, షర్టు మార్చుకోవాల్సి వచ్చింది.

  జాక్వలైన్ చిలిపి ఆలోచన..

  జాక్వలైన్ చిలిపి ఆలోచన..

  కారులో వరుణ్ దుస్తులు మార్చుకొంటుండగా జాక్వలైన్ మదిలో చిలిపి ఆలోచన వచ్చింది. వరుణ్ దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసింది. అంతటితో ఆగకుండా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

  కారులోనే..

  వరుణ్ వీడియోతో పాటు జాక్వలైన్ ఓ పోస్ట్‌ను కూడా పెట్టింది. వరుణ్ ఓ పార్టీ నుంచి మరో పార్టీకి ఇలా వెళ్తాడు. నా కారులోనే బట్టలు మార్చుకొన్నారు. థ్యాంక్యూ వరుణ్. నా కారును నీవు చేంజ్ రూమ్ చేశావు అని జాక్వలైన్ ఓ సందేశాన్ని పెట్టింది.

  వరుణ్ హల్‌చల్

  వరుణ్ హల్‌చల్

  అంబానీ ఇంట్లో జరిగిన పార్టీకి సంప్రదాయ లహెంగాను ధరించి కనిపించింది. వరుణ్ ధావన్ వైట్ టీషర్టు, డెనీమ్ జాకట్, జీన్స్ ధరించి పార్టీలో హల్‌చల్ చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు.

  హలో బ్రదర్..

  హలో బ్రదర్..

  తెలుగులో నాగార్జున నటించిన హలో బ్రదర్ చిత్రాన్ని 1997లో జుడ్వా అనే పేరుతో రీమేక్ చేశారు. సల్మాన్ నటించిన ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా జుడ్వా2 రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదలకు ముస్తాబైంది.

  English summary
  Varun and Jacqueline attended Falguni Pathak's dandiya night, along with their other Judwaa 2 co-star, Taapsee Pannu. Afterwards, they headed straight for the Ambani bash at Antilla, where the who's who of Bollywood made an appearance. While Jacqueline was happy to attend the do in her pastel-coloured floral lehenga, Varun decided to change into a white tee, denim jacket and jeans. Hard-pressed for time, he changed outfits in Jacqueline's car.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more