»   » హిందీలో సీక్వెల్ కూడా చేస్తున్నారు: నాగార్జున ఇంత సైలెంట్ అయితే ఎలా??

హిందీలో సీక్వెల్ కూడా చేస్తున్నారు: నాగార్జున ఇంత సైలెంట్ అయితే ఎలా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో తెలుగులో హలో బ్రదర్ పెద్ద హిట్.. నాగార్జున కెరీర్లో చెప్పుకొదగ్గ హిట్ సినిమాల్లో 'హలో బ్రదర్' సినిమాది టాప్ ప్లేస్. నాగార్జున-ఈవివి సత్యనారాయణ కాంబినేషన్లో 1994లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపించింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ దేవాగా దొంగ పాత్రలో, రాక్ స్టార్‌గా రవి పాత్రలో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను అలరించాడు.

నాగార్జున డ్యూయల్ రోల్

నాగార్జున డ్యూయల్ రోల్

నాగార్జున తన కెరీర్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా కూడా ఇదే. అది హిట్ అయిన మూడేళ్ల తర్వాత దాని రీమేక్ గా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా జుడ్వా వచ్చింది. అది కూడా హిట్ అయింది.కంప్లీట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కింది హలో బ్రదర్ సినిమా. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

రీమేక్ చేస్తే బాగుంటుందని

రీమేక్ చేస్తే బాగుంటుందని

అప్పట్లో ఈ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి. పంచ్ డైలాగులు, పాటలు, ఆర్టిస్టులు.. ఇలా అందరూ కుదిరారు. తర్వాత ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని.. నాగచైతన్య, అఖిల్ వద్దకు కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు.

నాగ చైతన్య

నాగ చైతన్య

నాగ చైతన్య దాదాపుగా సినిమా మొదలు పెట్టేవరకూ వెళ్ళి మరీ ఆగిపోయాడు. తర్వాత ఇదే విశయం ప్రస్తావనకు వచ్చినప్పుడు "‘హలో బ్రదర్‌' రీమేక్‌ చేద్దామని ఒకప్పుడు అనుకున్నాను. కానీ అది చెయ్యకపోవడమే మంచిది. అది క్లాసిక్‌. ఆ లెవల్లో నేను చేయలేను. దాన్ని రీక్రియేట్‌ చెయ్యలేను". అంటూ తాను ఇక ఆ ప్రాజెక్ట్ చేసేదే లేదన్నట్టు తేల్చేసాడు.

జుడ్వా-2

జుడ్వా-2

అయితే మళ్లీ ఇన్నేళ్లకు టాలీవుడ్ లో కుదరలేదు గానీ బాలీవుడ్ లో మాత్రం సీక్వెల్ తయారయ్యి జుడ్వా-2 గా వస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు హిందీలో ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని కూడా డేవిడ్ ధావనే రూపొందిస్తున్నాడు.

సల్మాన్ హీరోగా నటించట్లేదు

సల్మాన్ హీరోగా నటించట్లేదు

ఐతే సీక్వెల్లో సల్మాన్ హీరోగా నటించట్లేదు. డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించాడిందులో. అతడి సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తాప్సి హీరోయిన్లు గా నటించారు. దసరా కానుకగా సెప్టెంబరు 29న ‘జుడ్వా-2' ప్రేక్షకుల ముందుకు రానుంది.

హలో బ్రదర్-2

హలో బ్రదర్-2

‘జుడ్వా-2' మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. హిందీలో ఈ చిత్రం బాగా ఆడితే.. తెలుగులోనూ ‘హలో బ్రదర్-2' వైపు మళ్ళీ ఆలోచిస్తారేమో చూడాలి. ఎందుకంటేనాగార్జున చేసిన పాత్ర ఆయన కొడుకు మళ్ళీ చేయటం అనేది ప్రేక్షకులకి కొత్త అనుభూతి కదా ఆ విధంగా కూడా వర్క్ ఔట్ అయ్యే చాన్స్ లు ఉన్నాయి.

English summary
Judwaa 2 is an upcoming Indian Hindi action-comedy film directed by David Dhawan, starring Varun Dhawan in a double role as estranged twins opposite Jacqueline Fernandez and Taapsee Pannu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu