»   » ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించడం లేదట.. నిరుత్సాహంలో ఫ్యాన్స్

ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించడం లేదట.. నిరుత్సాహంలో ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మహానటి చిత్రంలో నటిస్తున్నారనే ఓ రూమర్ నందమూరి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ వార్తపై ఆరా తీయగా అందులో వాస్తవం లేదు. అదంతా గాసిప్ రాయుళ్లు సృష్టించిన వార్త అని తేలింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న మహానటి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారనే వార్త మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Junior NTR is not in the Savitri biopic Mahanati movie

మహానటిలో సీనియర్ ఎన్టీఆర్ కనపడుతున్నారనే వార్త బయటకు రాగానే ఫ్యాన్స్ జోష్ పుంజుకొన్నది. మహానటిలో నటించడం లేదని ఈ వార్తపై ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చారు. దాంతో నందమూరి ఫ్యాన్స్‌లో నిరుత్సాహం నిండుకొన్నది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో, సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

English summary
Junior NTR is not in the Savitri biopic Mahanati movie. Reports media suggest on Thursday morning that Young Tiger is playing Senior NTR role in Mahanati. But NTR sources are condemned this and said he was not playing any role in Mahanati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu