»   » ఫ్యాన్స్ కోసం దిగొచ్చారు: చిరు, పవన్, బాలయ్య, చెర్రీ, జూ ఎన్టీఆర్

ఫ్యాన్స్ కోసం దిగొచ్చారు: చిరు, పవన్, బాలయ్య, చెర్రీ, జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా తారలు....అభిమానులకు అందనంత ఎత్తులో ఉంటారు. వాస్తవానికి వారిని అంత ఎత్తుకు అందంలం ఎక్కించింది అభిమానులే. వారి ఆదరణ వల్లే వారు ఆ స్థాయికి ఎదిగారనేది కాదనలేని వాస్తవం. అలాంటి అభిమానులకు కష్టం వచ్చినపుడు దిగి రావడం, వీలైతే సహాయం చేయడం వారి బాధ్యత.

తమ బాధ్యతను గుర్తెరిగి మసులుకున్నపుడే సినీ వినీలాకాశంలో వారికి ఎక్కువ కాలం వెలిగే అవకాశం ఉంటుంది. తమ బాధ్యతను గుర్తించారు కాబట్టే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య ఇతర హీరోలు స్టార్స్ గా వెలుగొందుతున్నారు. తాజాగా జూ ఎన్టీఆర్ కూడా వీరి లిస్టులో చేరారు.

అనారోగ్యంతో, ప్రాణాంతకమైన వ్యాధులతో బాధ పడుతూ ఆ పరిస్థితుల్లోనూ తమను చూడాలని ఆశ పడ్డ అభిమానులను గతంలో చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితరులు గతంలో స్వయంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం జూ ఎన్టీఆర్ కూడా క్యాన్సర్ తో బాధ పడుతున్న తన అభిమానిని వెళ్లి కలిసారు. బాధ్యతగా వ్యవహరిచారు.

చిరంజీవి

చిరంజీవి


తనను కలవాలని ఆశ పడుతున్న బాలు అనే క్యాన్సర్ బాధిత బాలుడిని హైదరాబాదులోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చిరంజీవి కలిసారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన అభిమాని కోరిక మేరకు ఆ మధ్య పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెను కలిసిన సంగతి తెలిసిందే. స్వయంగా తన అభిమాన హీరో వచ్చి మోరల్ సపోర్టు ఇవ్వడంతో....అనుకున్న సమయం కంటే ముందుగానే రికవర్ అయింది శ్రీజ.

బాలయ్య

బాలయ్య


నందమూరి నట సింహం బాలయ్య కూడా....తనను చూడాలని పరితపించిన శ్రావణి అనే 12 ఏళ్ల అభిమాని కోసం ఆసుపత్రికి వెళ్లి కలిసారు. తన మోరల్ సపోర్టు ఇచ్చారు. శ్రావణి గత రెండేళ్లుగా లుకేమియాతో బాధ పడుతోంది. రెండు సంవత్సరాలుగా కోమాలో ఉంది. ఇటీవలే కోమా నుండి బయటకు వచ్చిన శ్రావణి...తన అభిమాన హీరో బాలయ్యను చూడాలని కోరింది. ఈ విషయం బాలయ్యకు చేరడంతో వెంటనే ఆయన స్పందించి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు.

రామ్ చరణ్

రామ్ చరణ్


రామ్ చరణ్ తేజ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న పదేళ్ల రాహుల్‌ను కలిశాడు. తనకు రామ్ చరణ్ తేజని చూడాలని ఉందని బాలుడు కోరాడు. దీంతో ప్రత్యూష ఫౌండేషన్ ఈ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని చెర్రీ దృష్టికి తీసుకు వెళ్లింది. దీంతో చెర్రీ రాహుల్ వద్దకు వచ్చి అరగంట పాటు మాట్లాడాడు. దీంతో అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనిధి అనే పదేళ్ల చిన్నారిని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి పరామర్శించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారి తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను చూడాలని ఆశ పడింది.

English summary
Telugu actor Junior NTR met his ardent fan Sri Nidhi, who is suffering from blood cancer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu