ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ డేట్ ఫైనల్.. ఎన్నడో తెలుసా!
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం తేదీ ఖారారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం తేదీ ఖారారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారు.

జై లవకుశగా పేర్కొంటున్న ఈ చిత్రం ఎన్టీఆర్‌కు 27వ చిత్రం. ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నట్టు నిర్మాత కల్యాణ్ రామ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నది.


Click it and Unblock the Notifications











