»   » నాకున్న పొగరు వల్లే నా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి

నాకున్న పొగరు వల్లే నా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో వివాదాస్పద ట్వీట్లతో తప్ప సినిమాలతో సంచలనాలు చేయటం తగ్గించాడు. ఒకప్పుడు వర్మ అంటే అద్బుతమైన దర్శకుడన్న పేరుండేది. అయితే ఇటీవలి కాలంలో ట్విట్లకే పరిమితమైన వర్మ ఇప్పుడు తన సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణాలను వెతుక్కునే పనిలో పడ్డాడు...

చాలా కాలం తర్వాత ముంబై తిరిగి వెళ్లిన ఆయనను అక్కడి మీడియా ప్రశ్నించినపుడు "నా పొగరే నా సినిమాలు ఫ్లాప్ కావటానికి కారణం" అంటూ ఆయన చెప్పిన సమాధానం రిపోర్టర్లని విస్మయపరిచింది. తాను సినిమాలు త్వరత్వరగా తీసేసి ప్రేక్షకుల మీదికి వదలటం వల్లే అవి ఫ్లాప్ అవుతున్నట్లు కొందరు చెబుతున్నారట, కానీ ఇంతకుముందు తాను తీసిన డిపార్ట్‌మెంట్, ఆగ్ లాంటి సినిమాలకు కూడా చాలా సమయం తీసుకున్నా.. అవి కూడా ఆడలేదని గుర్తుచేశారు. నన్ను నేను ఒకసారి సమీక్షించుకోవాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు.

Just because of my attitude my movies are gone flap-varma

సర్కార్ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేసాం. సత్య కూడా లో బడ్జెట్ సినిమానే అయినా అవి విజయం సాధించాయి. నేను అడవిగుర్రం లాంటివాడిని,, నా ఆటవికతను అణిచేసుకోడానికి ప్రయత్నిస్తే, నాలోని విభిన్నత కూడా అణిగిపోతుంది అంటూ చెప్పుకొచ్చిన వర్మ. తాను రెండేళ్లలో ఆరు స్క్రిప్టులు పూర్తిచేశాని, దాంతోపాటు వందలకొద్దీ విదేశీ సినిమాలు చూసి, కొత్త ఉత్సాహం పొందానని చెప్పారు. తన పొగరు వల్ల, అతి నమ్మకం వల్ల చేసిన తప్పులన్నీ సరిచేసుకుని.. మళ్ళీ ఇప్పుడు ముంబైకి వచ్చానని వర్మ సెలవిచ్చారు.

ఇక తన కొత్త కార్యాలయం 'కంపెనీ' విశయాలని చెపుతూ నా ఆఫీస్ ఇప్పుడో టూరిస్టు స్పాట్‌లా మారిపోయింది, కేవలం బాలీవుడ్ నుంచే కాక టాలీవుడ్ నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తున్నారని, కొంతమంది అసలు సినిమాలతో సంబంధం లేనివాళ్లు కూడా వస్తున్నారని చెప్పారు. తన మీద ఉన్న పాత ముద్రను పూర్తిగా చెరిపేసుకుని కొత్తతరహాలో కనిపించాలనే ఈ ఆఫీసును కూడా అలా తయారుచేశానన్నారు. మొత్తానికి తనని తాను సరిదిద్దుకునే పనిలోపడ్డాడన్న మాట...

English summary
"my attitude is my problem"-says bollywood director and producer Ramgopalvarma
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu