»   » వర్మ మళ్ళీ ట్వీటుకున్నాడు... జాతీయగీతం విషయంలో సుప్రీం నిర్ణయాన్ని ఇలా....

వర్మ మళ్ళీ ట్వీటుకున్నాడు... జాతీయగీతం విషయంలో సుప్రీం నిర్ణయాన్ని ఇలా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా ప్రారంభం కంటే ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని ఆదేశాలిచ్చింది. జాతీయ జెండాను తెరపై ప్రదర్శించాలని పేర్కొంది.

థియేటర్ లోని ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పింది. జాతీయగీతం, జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆదేశించింది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులను కేంద్రం జారీ చేయనుంది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించనున్నారు.జనగణమనకు ఎటువంటి మార్పులు లేకుండా.. యథాతథంగా ఉండాలని కూడా చెప్పింది కోర్టు. ఈ ఆదేశాలు చాలామందికి మింగుడుపడ్డం లేదు కానీ.. దీనిపై ఓపెన్ గా విమర్శలకు దిగాడు రామ్ గోపాల్ వర్మ.పొద్దున్నుంచీ వరుసగా ఇవే ట్వీట్ లు చేస్తూనే ఉన్నాడు .

Just Why Should The National Anthem Be Played In Cinema Halls Ram Gopal Varma

'సినిమా హాల్స్ లో మాత్రమే జాతీయగీతాన్ని ఎందుకు పరిమితం చేయాలి? ఏదైనా షాప్ లోకి ప్రవేశించే ముందు.. కస్టమర్లను వీడియో చూసి లోపలకు రావాలని ప్రతీ షాప్ వాళ్లు ఎందుకు చెప్పకూడదు?', "ఒక వేళ వార్తా పత్రిక మొదటి పేజీలో జాతీయ గీతం వేయటం మొదలు పెడితే... జనం డైరెక్ట్ గా రెండో పేజీనుంచి చదవటం మొదలు పెడతారు" ఇలా వరుసగా ట్వీట్ లు వేస్తూనే ఉన్నాడు. . ఈ దర్శకుడి నుంచి విమర్శలు సాధారణమే కానీ.. ఏకంగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కూడా కౌంటర్లు వేయడం అంటే.. ఆశ్చర్యకరమే.

అయితే ఈ ఫ్రస్ట్రేషన్ ఇప్పటిది మాత్రమే కాదేమో అంటూ వర్మ పత సినిమా "రణ్" అప్పటి వివాదం గుర్తు చేస్తున్నారు మరికొందరు. తన తాజా చిత్రం 'రణ్'లో టైటిల్ ట్రాక్ కోసం జాతీయ గీతమైన 'జన గణ మన అధినాయక జయహే' గీతాన్ని 'జన గణ మన రణ్ హై' అంటూ రీమిక్స్ చేసి పాడించడంపై సెన్సార్ బోర్డు అప్పట్లో అభ్యంతరం తెలిపింది. దీనిని ఎంతమాత్రం అనుమతించేది లేదని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) తేల్చిచెప్పింది.

Just Why Should The National Anthem Be Played In Cinema Halls Ram Gopal Varma

దాంతో ఆయన మీడియా సమావేశంలో తాను ఎవరినీ విమర్శించటానికి, దేన్నీ అవమానించటానికి ఆ నిర్ణంయం తీసుకోలేదని కేవలం చిత్రానికి ప్రచారం కల్పించటానికే అంటూ చెప్పి తన పబ్లిసిటీ వ్యూహం లో భాగంగానే అలా చేసానంటూ ఒప్పుకున్నాడు. అంతే కాదు సెన్సార్ బోర్డు ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసాడు. జాతీయ గీతం వక్రీకరణపై సుప్రీంకోర్టు దర్శకుడు రామ్ గోపాల వర్మకు మొట్టికాయలు వేసింది. జాతీయ గీతంతో ఆటలొద్దని సలహా ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాతీయ గీతాన్ని తొలగించాలనే సెన్సార్ బోర్టు నిర్ణయంపై సినిమాటోగ్రఫీ చట్టం కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు వర్మకు సూచించింది.

అప్పటి అక్కసుకూడా ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం మీద తీర్చుకున్నాడు అనుకుంటున్నారు జనం అయితే.. వర్మ ఇక్కడ బాగా తెలివిగా ట్వీట్ చేశాడు. కోర్టు ఆదేశాలపై నేరుగా విమర్శిస్తే.. కోర్టు ధిక్కార నేరం అవుతుంది. అందుకే షాపులకు లింక్ చేసి ఏదో డౌట్ అడుగుతున్నట్లుగా ట్వీట్ పెట్టాడు. కానీ చెప్పాల్సిన పాయింట్ మాత్రం జనానికి చేరవేసేసాడు.

English summary
Director Ramgopal Varma Tweeted against supreme court rule that National anthem in theaters
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu