»   » కదులుతున్న కారులో ప్రేయసితో శృంగారం.. మరో వివాదంలో జస్టిన్ బీబర్ (ఫొటోలు)

కదులుతున్న కారులో ప్రేయసితో శృంగారం.. మరో వివాదంలో జస్టిన్ బీబర్ (ఫొటోలు)

Written By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలే యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో కచేరీ కోసం వెళ్లిన బీబర్ హాటల్‌కు సమీపంలో కదులుతున్న కారులో ఓ గుర్తు తెలియని మహిళ కౌగిలిలో బందీ కావడం స్పష్టంగా కనిపించింది.

Justin Bieber

అంతకు ముందే తన మరో పాప్ స్టార్ సెలెనా గోమేజ్‌తో అతి సన్నిహితంగా ఉంటూ ఉండటం మీడియా కంటపడింది. తాను నిర్వహించే పార్టీని పట్టించుకోకుండా మహిళతో వెళ్లడం వివాదాస్పదమైంది.

బీబర్ కొత్త ప్రేయసి లూసియానా

బీబర్ కొత్త ప్రేయసి లూసియానా

బీబర్ తో ఉన్న మిస్టరీ మహిళను లూసియానా చామోన్ అని గుర్తించారు. బ్రెజిల్‌లోని తన అద్దే నివాసానికి ఆమెను తీసుకొని బీబర్ వెళ్లినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై మాజీ ప్రేయసి సెలీనా గోమేజ్ మండిపడింది. ఆ విషయం గురించి తన వద్ద ప్రస్తావించవద్దని ఆమె సూచించింది.

అభిమానులకు నామం పెట్టి..

అభిమానులకు నామం పెట్టి..

అయితే వాస్తవానికి బీబర్ ఓ పార్టీకి హాజరుకావాల్సి ఉంది. తన అభిమాన స్టార్ బీబర్ పాల్గొనే పార్టీ కోసం దాదాపు 700 మంది అతిథులు టికెట్ కొని వచ్చారు. అయితే ఆ పార్టీకి వెళ్లకుండా బీబర్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

కారులతోనే ప్రేయసికి ముద్దుల వర్షం

కారులతోనే ప్రేయసికి ముద్దుల వర్షం

పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తన చేతులను లూసియానా చుట్టూ వేసి ముద్దుల వర్షం కురిపించాడు. ఆ సమయంలో కారులో డ్రైవర్, తన సహాయకుడు కూడా కారులోనే ఉండటం గమనార్హం. కారులో వారి రాసలీలలను బ్రెజిల్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

సెలెనా పోలీకలతో..

సెలెనా పోలీకలతో..

లూసియానా చామోన్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది. బీబర్ మాజీ ప్రేయసి సెలెనా పోలికలు చామోన్‌కు చాలా ఉన్నాయి. మరుసటి రోజు వీరిద్దరూ బ్రెజిల్ లోని రియో రెయిన్ ఫారెస్ట్‌లో తిరుగుతూ కనిపించారు.

త్వరలోనే ముంబైలో సంగీత కచేరీ

త్వరలోనే ముంబైలో సంగీత కచేరీ

త్వరలోనే పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్‌లో పర్యటించనున్నారు. ముంబైలో సంగీత కచేరిని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతులు, నిర్వాహణ వ్యయాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆసియా పర్యటనలో భాగంగా నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కచేరిని నిర్వహించనున్నారు. ఈ వేడుకలో బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా కూడా పాల్గొనే అవకాశం ఉంది.

English summary
Pop star Justin Bieber was pictured leaving a hotel with a mystery woman after his concert in Rio de Janeiro. The mystery woman was reported to be Luciana Chamone. Snuggling in the back of his car, Justin didn't seem to have any regrets about skipping his own after party, where 700 guests had reportedly paid to hang out with the pop star.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu