»   » హీరో నితిన్ ఆమె కాళ్ళు పట్టుకున్నాడా..!? జ్వాలాగుత్తా ఇదిగో ఇలా చెప్పింది

హీరో నితిన్ ఆమె కాళ్ళు పట్టుకున్నాడా..!? జ్వాలాగుత్తా ఇదిగో ఇలా చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్ హీరోగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే మూవీలో ఒక స్పెషల్ సాంగ్‌లో ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో గుత్తా జ్వాల నటించేందుకు నితిన్ ఆమె కాళ్లుపట్టుకున్నాడనే పుకారుపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. కాళ్లు పట్టుకోవడం లాంటిది ఏమీ లేదని, అయితే ఆ పాట తనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందని అందుకే చేసాననీ చెప్పింది. అది ఐటెమ్ సాంగ్ కాదని, స్పెషల్ సాంగ్ అనాలంటూ చెప్పిందీ హాట్ భ్యాట్ మింటన్ ప్లేయర్.

ఇంతకీ ఈ కాళ్ళు పట్టుకుని బతిమాలటం అనే పుకారు ఎలా స్టార్టయ్యిందీ అంటే... గుండెజారి గల్లంతయ్యిందే ఆడియో వేడుకలో " నితిన్ నా కళ్ళు పట్టుకొని బతిమాలాడు. అందుకే ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించాను" అంటూ కమెంట్ చేసింది జ్వాల. దాని సమాధానంగా నితిన్

Jwala Autta About Her special song in "Gunde jari Gallamntayyinde"

" ఆమె కాళ్ళు పట్టుకున్నది నిజమే, బ్యాట్మింటన్ ప్లేయర్ కదా....టైట్ స్కర్టులేస్తుంది. అందుకే కాళ్ళు పట్టుకున్నా" అని చెప్పడంతో గుత్తా జ్వాలా ఎంతగా నవ్విందంటే...పొట్ట చేక్కలయ్యేలా అన్నంత విధంగా నవ్వింది. నితిన్ సమాధానం తో వేడుక మొత్తం నవ్వులతో మారుమోగింది. అయితే ఇదంతా కేవలం నవ్వుకోవటానికి మాత్రమే ఈ ఇద్దరూ అలా మట్లాడారు కానీ బయటం మాత్రం. నిజంగానే నితిన్ జ్వాల కాళ్ళు పట్టుకున్నాడంటూ గుసగుసలు మొదలయ్యాయి. అదీ విషయం.

నితిన్‌తో ఫ్రెండ్‌షిప్ కారణంతో గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో గుత్తాజ్వాల నటించింది. అయితే ఈ సినిమా ద్వారా మంచి ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ అవకాశాలు రాలేదు లేదు సరి కదా, ఆమె గ్లామర్ అందాల గురించి నెగటివ్‌గా మాట్లాడుకున్నారు. పైగా గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో గుత్తా ఆకట్టుకోలేకపోయింది. డ్యాన్స్ పెద్దగా చేయలేదు. నువ్వు పెద్దగా డ్యాన్స్ చేయలేకపోయినా ఫర్వాలేదు, కనిపిస్తే చాలు అని నితిన్ చెప్పడంతో చిన్నచిన్న స్టెప్పులతో కానిచ్చేసిందట.

English summary
Gutta Jwala shared some movements with hero nitin while she doing the hot Item song in Gundejari Gallantayyinde
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu