»   » బ్యాట్మింటన్ తార టాలీవుడ్ ఎంట్రీ

బ్యాట్మింటన్ తార టాలీవుడ్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల త్వరలో సినీరంగ ప్రవేశం చేయనుంది. తన సినీ ఎంట్రీని గురించి సమాచారాన్ని జ్వాల స్వయంగా వెల్లడించేందకు సిద్దం అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. జ్వాల తరచూ సినిమా ఫంక్షన్ లలో దర్శనం ఇస్తుండటం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. కొంత కాలంగా జ్వాలతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఓ హీరో...ఆమెను రంగుల తెరపైకి గుంజటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని సమచారం. జ్వాల కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సదరు హీరో దర్శకులు, నిర్మాతలతో ఈ విషయమై సంప్రదిస్తున్నట్లు తెలుస్తూంది. గత కొంత కాలం క్రితమే భర్త చేతన్ ఆనంద్ కు విడాకులు ఇచ్చిన జ్వాల ప్రస్తుతం వివిధ బ్యాట్మింటన్ టోర్నీలతో పాల్టొంటూ వస్తుంది. క్రీడారంగంలో ఆమె సాధించిన విజయాలకు ను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు అర్జున అవార్డు బహూకరించింది.

అయితే..ఇప్పట్లో తనకు బ్యాట్మింటన్ కెరీర్ నుంచి వైదొలగే ఆలోచనల లేదని జ్వాల పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సినీ రంగ ప్రవేశం వార్తల్లో నిజం ఎంతో జ్వాల స్వయంగా వివరణ ఇస్తే బాగుంటుందని పలువురి అభిప్రాయం.

English summary
Badminton star jwala gutta enter to the tollywood soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu