»   »  బూతు సైట్లలో హీరోయిన్ ఫోటోలు, వార్నింగ్

బూతు సైట్లలో హీరోయిన్ ఫోటోలు, వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య సినీతారల ఫోటోలు అసభ్యంగా, నగ్నంగా మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పోస్టు చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. కొన్ని సందర్భాల్లో ఈ మార్ఫింగ్ ఫొటోలు సినిమా యాక్టర్లను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. కెరీర్‌కు నష్టం చేకూరుస్తున్నాయి. దీనికి తోడు మానసిక ఆందోళన అదనం.

ఎప్పుడైనా తమ మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో దర్శనమిస్తే.... చాలా మంది హీరోయిన్లు మిన్నకుండి పోతున్నారు. దానికి గురించి కంప్లైంట్ చేసినా, మాట్లాడినా వ్యవహారం మరింత పెద్దదై తమ గురించి దుష్ప్రచారం జరుగుతుందనే భయమే ఇందుకు కారణం.

జ్యోతి కృష్ణ ఫోటో గ్యాలెరీ

 Jyothi Krishna hits back

తాజాగా ఈ మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంతో ఇబ్బంది పడుతోంది మళయాల నటి జ్యోతి కృష్ణ. ఆమెకు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ ఫోటోలు అశ్లీల వెబ్ సైట్లు, పోర్న్ వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ వ్యవహారం అందరికీ వెంటనే తెలిసిపోయింది. ఇండస్ట్రీకి చెందిన వారు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారు.

తానంటే గిట్టని వారు ఎవరో తన ఫోటోలు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెట్టారని ఆమె పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని వదిలి పెట్టనని, చట్టపరంగా తగిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి వ్యవహారాల్లో తనలాంటి బాధితుల్లో మానసిక బలాన్ని పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.

ఇలాంటి వ్యవహారాలను అరికట్టాలని, దీనికి సంబంధించిన కొత్త చట్టాలు తీసుకురావాలని.. మహిళల ప్రైవసీని దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులంతా ఇదే తీరుగా రియాక్ట్ అయితే మంచి ఫలితం ఉంటుందన్నారు. దీనిపై ఏ సమరానికైనా సిద్ధమంటోంది జ్యోతికృష్ణ.

English summary
Krishna who has 1.5 million followers on Facebook said she was speaking out to 'give other social media harassment victims like myself the strength to express their voice'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu